పోలీసు దెబ్బలని ఊరికే అనరేమో? కంటికి కనిపించకుండా.. ఒళ్లు హునమయ్యేలా కొట్టటంలో పోలీసులు దిట్టగా చెబుతుంటారు. కానీ.. పోలీసుల కారణంగా తనకు తగిలిన దెబ్బల్ని బయటకు చూపించారు ఎంపీ గల్లా జయదేవ్. ఏపీ రాజధానిని మూడు చోట్లకు మారుస్తున్న నేపథ్యం లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.
ఈ సందర్భంగా గల్లా జయదేవ్ ను పోలీసులు లిఫ్ట్ చేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకోవటం.. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తన పట్ల పోలీసులు అమర్యాదగా వ్యవహరించారని అప్పట్లో గల్లా ఆరోపించారు. పోలీసుల తీరును తప్పు పట్టారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పోలీసులు తనను గిచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు గల్లా.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్.. టీడీపీ నేత టీడీ జనార్థన్ కు ఆయన తనను పోలీసులు గిచ్చిన తీరును చూపించారు. ఈ క్రమంలో చొక్కా విప్పి మరీ.. తనకు తగిలిన గాయాల్ని చూపించారు. ఇప్పటి వరకూ పోలీసులు గిచ్చుతారని తనకు పలువురు చెబితే విన్నానని.. కానీ తనను గిచ్చితే కానీ అదెంత నొప్పిగా ఉంటుందో తెలీయ లేదని గల్లా వ్యాఖ్యానించారు. పోలీసులు తనను గిచ్చి పది రోజులు అవుతున్నా.. ఇప్పటివరకూ ఆ గాయాలు మానలేదన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ కు తగిలిన గాయాల్ని చూసిన లోకేశ్.. జనార్థన్ లో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మరి.. పోలీసు దెబ్బలని ఊరికే అంటారా ఏంది?