వివాదాస్పద మత గురువు.. ఇద్దరు సాధ్వీలను లైంగిక వేధింపులకు గురి చేసిన కేసులో ఇరవై ఏళ్లు జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబా అలియాస్ గుర్మీత్ కు దత్తకుమార్తెగా చెప్పుకునే హనీప్రీత్ దెబ్బకు పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన్ను తప్పించేందుకు భారీ ఎత్తున హింసకు కారణమైందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 38 ఏళ్ల హనీప్రీత్ ను పోలీసులు విచారించారు.
ఐదు వారాలకు పైగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న హనీప్రీత్ ఇటీవల పట్టుబడటం.. ఆమెను కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఆరు రోజులు పోలీసుల కస్టడీకి ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. విచారణలో భాగంగా హనీప్రీత్ కు పోలీసులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినట్లుగా చెబుతున్నారు.
డేరా బాబాకు సంబంధించిన కీలక సమాచారం కోసం హనీకి పలు ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. అయితే.. అధికారుల ప్రశ్నలకు హనీ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. గుర్మీత్‌కు కెనడా.. దుబాయ్ లలో ఆస్తులు ఉన్నాయా? గుఫా గురించి నిజం ఏమిటి? డేరా ఆశ్రమంలో ఖుర్బానీ గ్యాంగ్ ఏం చేస్తుంది? డేరా సచ్ఛా సౌధాకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? డేరా బాబాకు ఏ ఏ రాజకీయనాయకుడితో సంబంధాలు ఉన్నాయి? లాంటి ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా చెబుతున్నారు.
అయితే.. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో చాలావరకూ తనకేమీ తెలీదన్న మాటనే హనీ చెప్పిందని చెబుతున్నారు. గుర్మీత్ ఏం అవుతారన్న ప్రశ్నకు మాత్రం తన తండ్రి లాంటి వారని చెప్పినట్లుగా తెలుస్తోంది. గుఫా గురించి అడిగినప్పుడు మాత్రం అదంతా వట్టి పుకారే తప్పించి నిజం లేదని చెప్పిన హనీ.. ఖుర్బానీ గ్యాంగ్ లాంటివేమీ డేరా ఆశ్రమంలో లేవని చెప్పినట్లుగా సమాచారం.
గుర్మీత్ నిర్మించిన సినిమాలకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయన్న ప్రశ్నకు తనకు తెలీదన్న హనీ.. పోలీసుల్ని తప్పించుకొని తిరిగిన సమయంలో ఎవరెవరితో మాట్లాడారన్న ప్రశ్నకు.. చాలామందితో అన్న సమాధాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలన్న విషయంపై ఫుల్ క్లారిటీతోనే హనీ ఉన్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.పోలీసులకు దొరకకుండా అన్నేసి రోజులు ఉండగలిగిన హనీ.. అధికారుల ప్రశ్నలకు ఎలా రియాక్ట్ కావాలన్న దానిపై పక్కా స్కెచ్ తో వ్యవహరించారని చెప్పకతప్పదు.