రాజకీయం.. అధికారం నాకెప్పుడు ఇష్టం లేదు

Update: 2019-11-12 05:02 GMT
సినిమా హీరో తనయుడు సినిమా ఇండస్ట్రీ లోకి.. రాజకీయ నాయకుడి కొడుకు రాజకీయా ల్లోకి వెళ్లడం చాలా కామన్‌ గా చూస్తూ ఉన్నాం. కాని ఈ మద్య కొందరు రాజకీయ నాయకులు తమ వారసులను తమకున్న పలుకు బడిని ఉపయోగించి సినిమా ల్లోకి తీసుకు వస్తున్నారు. సినిమా ల్లో రాణించిన తర్వాత రాజకీయా ల్లోకి దించొచ్చు అనే ఉద్దేశ్యంతో ప్లాన్స్‌ చేస్తున్నారు. అయితే ముఖ్య మంత్రి వారసుడు మాత్రం రాజకీయాల కు దూరంగా ఉండి పోయాడు.

మహా రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి విలాస్‌ రావ్‌ దేశ్‌ ముఖ్‌ కుమారుడు అయిన రితేష్‌ దేశ్‌ ముఖ్‌ బాలీవుడ్‌ లో హీరోగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. తండ్రి బతికి ఉన్న సమయం లో రితేష్‌ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి తర్వాత రితేష్‌ రాజకీయా ల్లోకి వెళ్తాడని కొందరు భావించారు. కాని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా రితేష్‌ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన చేయడం లేదు. ఇటీవల రితేష్‌ తన రాజకీయ ఎంట్రీ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడాడు.

నాకు ఎప్పుడు కూడా రాజకీయం మరియు అధికారం అంటే ఆసక్తి లేదు. అందుకే నేను ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రాజకీయా ల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. నటించడమే నా పని.. అదే నాకు అధికారం వంటిది అంటూ పేర్కొన్నాడు. నాకు రాజకీయాలు ఆసక్తి లేక పోవడం వల్లే సినిమాల వైపు వచ్చి రాజకీయాలను నా సోదరులకు వదిలేశానంటూ చెప్పుకొచ్చాడు.

సోలో హీరో గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టు గా కూడా సినిమాలు చేస్తున్న రితేష్‌ దేశ్‌ ముఖ్‌ త్వరలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చిత్రం లో కీలక పాత్రను చేయబోతున్నట్లు గా ప్రకటించాడు. ఆయన భార్య జెనీలియా రీ ఎంట్రీ విషయ మై ప్రశ్నించిన సమయంలో ఆమె ఇష్టాను సారంగా వెళ్లనిస్తాను. ఆమెకు ఏది ఇష్టం అయితే అది చేసేందుకు నేను పూర్తి మద్దతు గా ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News