ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారితో మానవులు అరకోటి మందికి పైగా సతమతమవుతున్నారు. ఆ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తూ కల్లోలం సృష్టిస్తోంది. అయితే దాని కట్టడి కోసం చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఎందుకంటే ఆ వైరస్ రోజురోజుకు స్వరూపం మారుస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వైరస్ బలీయంగా మారి మానవాళిని కంగారు పెట్టిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో వైరస్ వ్యాపించి శరీరంలోనే ఉంటుంది. కానీ లక్షణాలను బయటకు కనిపించడం లేదు. అంటే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నవారిలో వైరస్ ప్రవేశించినా లక్షణాలు ఉండడం లేదు. ఇదే ప్రధాన కారణం ఆ వైరస్ ఇతరులకు వ్యాపించడానికి కారణమవుతోంది. ఎందుకంటే వైరస్ ప్రవేశించిన వ్యక్తి లక్షణాలు లేవని సాధారణంగా జీవిస్తుంటాడు. దీంతో అతడి వలన ఇతరులకు వ్యాపించనుంది.
వైరస్ శరీరంలో ప్రవేశించినా ఎలాంటి లక్షణాలు లేని వాళ్లు కరోనా క్యారియర్లుగా మారుతుండడంతో ఆందోళన కలిగించే విషయం. వారికి తెలియకుండానే చాలామందికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దీన్నే చైనాలో ఆదివారం నమోదైన కేసులు రుజువు చేస్తున్నాయి. ఆ దేశంలో 17 కొత్త కేసులు నమోదైతే.. వాటిలో 12 కేసుల్లో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. అయినా వారికి వైరస్ వ్యాపించింది.
అలా జరగడానికి ప్రధాన కారణం సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి అధికంగా ఉండి ఉంటుంది. వీరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చెయిన్ తెంచాలంటే ఒకటే పరిష్కారం. వీలైనంత ఎక్కువ పరీక్షలు చేయడం అత్యుత్తమ మార్గం. మన దేశంలోనూ ఇలాంటి లక్షణాలు లేని కేసులు అధికంగా నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను ఐసీఎంఆర్ అప్రమత్తం చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేసి వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంద.