ప్రధాని మోడీ ఒక అందాల బొమ్మ చేతిలో ఓడిపోయారు. అప్రతిహతంగా సాగిస్తున్న తన ప్రభావశీలతకు ఒక అమ్మాయి నుంచి పోటీ ఎదురవగా స్వల్పంగా ఆయన వెనుకబడ్డారు. అవును.... బాలీవుడ్ అందాల బొమ్మ ప్రియాంక చోప్రా ప్రధాని మోడీ కంటే ముందు నిలుస్తున్నారు. టైమ్సు మ్యాగజిన్ ఏటా నిర్వహించే ఆన్ లైన్ పోల్ లో ప్రియాంక చోప్రా కంటే మోడీ వెనుకబడిపోయారు. అత్యంత ప్రభావంతమైన వంద మంది వ్యక్తుల జాబితా కోసం మ్యాగజిన్ బుధవారం రాత్రి ఆన్ లైన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో మోడీని ప్రియాంక డామినేట్ చేశారు. కేవలం భారత ప్రధానికే కాదు పలు ఇతర దేశాల అధ్యక్షులను కూడా ప్రియాంక దాటేయడం విశేషం.
అమెరికాలో ప్రసిద్ధి చెందిన టీవీ సీరియల్ 'క్యాంటికోగా'లో నటించి మెప్పించిన ప్రియాంక చోప్రాకు 0.8 శాతం ఓట్లు రాగా... మోడీకి 0.7 శాతం ఓట్లు వచ్చాయి. మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ - ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిజ్ హోలాండే - బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ల కంటే ప్రియాంకా చోప్రా అధికంగా ఓట్లు సంపాదించింది. ఈ ఆన్ లైన్ పోల్ లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ 3.3 శాతం ఓట్లతో అగ్ర స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో దక్షిణ కొరియన్ బాయ్ బ్యాండ్ బిగ్ బ్యాంగ్ రెండో స్థానంలో నిలిచారు.