పూరి జగన్నాథ్ తమ్ముడికి వైసీపీ టికెట్!

Update: 2019-03-12 04:33 GMT
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రతిపక్ష వైసీపీకి ఎంతో కీలకం. గడిచిన 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో ఆ పార్టీ ఎన్నో కష్టాలు అనుభవించింది. అధినేత జగన్ కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఈ ఎన్నికల్లో అస్త్రశస్త్రాలను రెడీచేసి ముందుకెళ్లాలని వైసీపీ రెడీ అయ్యింది.

టీడీపీకి ఫుల్లుగా ఉన్న సినీ గ్లామర్ ఈసారి ఎన్నికల ముందర వైసీపీకి కూడా కలిసి వస్తోంది. సినీ ప్రముఖులు ఒక్కరొక్కరుగా వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. వైసీపీ కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖులను రంగంలోకి దించబోతోంది.

ఇప్పటికే నటుడు ఫృథ్వీ వైసీపీలో చేరి కీలక బాధ్యతలు చేపట్టారు. పోసాని - చోటా కే నాయుడు - కృష్ణుడు చేరారు. ఇప్పుడు సినీ నటి జయసుధ కూడా వైసీపీలో చేరారు. నిన్ననే అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ సోదరుడు పి. ఉమాశంకర్ గణేష్ కు నర్సీపట్నం టికెట్ ను వైసీపీ ఖరారు చేసింది. దీంతో పూరీ కూడా వైసీపీ తరుఫున ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.

పూరి జగన్నాథ్ తల్లి గతంలో వైసీపీ సర్పంచ్ గా పోటీచేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు అదే పార్టీ నుంచి ఏకంగా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో దర్శకుడు పూరి ఈసారి వైసీపీ తరుఫున ప్రచారం చేస్తాడన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి పూరి వస్తే మాత్రం వైసీపీకి బూస్ట్ గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:    

Similar News