రఘురామపై సీఐడీ వారి తాజా ప్రకటనలో ఏముంది?

Update: 2021-06-08 06:30 GMT
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామపై తాజాగా సీఐడీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఎంపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఊహాజనిత కంప్లైంట్లు చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. దర్యాప్తు సంస్థను బెదిరించేలా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొంది. దేశ ద్రోహం కేసులో సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేయటం.. అనంతరంగుంటూరు తీసుకురావటం తెలిసిందే.

కస్టడీలో ఉన్న తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా రఘురామ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన గాయాలపై ఆయన సుప్రీంను ఆశ్రయించటం.. గాయాలపై రిపోర్టులు సీఐడీ వాదనకు భిన్నంగా ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తన ఫోన్ సీఐడీ అధీనంలో ఉందని..దానిద్వారా వేరే వారికితప్పుడు మెసేజ్ లు పంపుతున్నట్లుగా రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు తాజాగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రఘురామ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఆ ప్రకటనలో ఏముందంటే..

- రఘురామను అరెస్టు చేసిన తర్వాత ఆయన సెల్ ఫోన్ సీజ్ చేశాం.

- ఆ ఫోన్ ఐఫోన్ 11ప్రొ మాక్స్. అందులో 90009111111 నెంబరుతో ఎయిర్ టెల్ సిమ్ ఉంది. ఇదే విషయాన్ని రఘురామ మాకు వాంగ్మూలం ఇచ్చారు.

- మే 15న సాక్షుల సమక్షంలో సీజర్ మెమో సిద్ధం చేసి ఫోన్ ను సీల్డ్ కవర్ లో ఉంచాం. ఆ వివరాల్ని గుంటూరులోని సీఐడీ కోర్టుకు అప్పుడే చెప్పాం.

- సీల్డ్ కవర్ లోని ఫోన్ ను విశ్లేషణ కోసం మే 18న ఏపీ ఫోరెన్సిక్  సైన్స్ ప్రయోగశాలకు పంపాం.

- అయితే.. ఎంపీ రఘురామ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో సీఐడీ అధికారులు 9000922222 సిమ్ ఉన్న సెల్ ఫోన్ సీజ్ చేసినట్లుగా పేర్కొన్నట్లుగా మీడియా ద్వారా తెలిసింది.

- ఫోన్ సీజ్ చేసిన సమయంలో రఘురామ ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా ఈ అంశం ఉంది.

-  రఘురామ ఫోన్ లో ఉన్న సిమ్ ఏ నంబర్ అన్నది సీఐడీకి తెలీదు. ఫోరెన్సిక్ ప్రయోగశాల నుంచి తుది నివేధిక వస్తేనే ఆ వివరాలు వెల్లడవుతాయి.
Tags:    

Similar News