ఏపీలో అధికార టీడీపీ - విపక్షం వైసీపీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నంద్యాల ఉప ఎన్నిక.. రాష్ట్రాన్ని సైతం ఒణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలూ అనేక వ్యూహ ప్రతి వ్యూహాలతో గెలుపు గుర్రం ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ప్రతి అంశాన్నీ వినియోగించుకుని ముందుకు పోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తన వియ్యంకుడు బాలయ్యను నేరుగా రంగంలోకి దింపి రోడ్ షో చేయిస్తూ.. ప్రచారంలో పార్ట్ చేశారు.
ఇక, వైసీపీ అధ్యక్షుడు జగన్ నేరుగా ఇంకో పనేమీ పెట్టుకోకుండా నంద్యాల గెలుపునే తన లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంత వరకు ఈ రెండు పార్టీలు ఇలా కష్టపడుతుంటే.. మరో పార్టీ అందునా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ప్రస్తుత ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, నంద్యాలలో తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి పక్షాన ప్రచారం చేయాల్సిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా ఇప్పుడు అది మానేసి.. టీడీపీ - వైసీపీలు ఏం చేస్తున్నాయో? లెక్కలు కడుతున్నారు.
ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేసిందని, ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఎన్నికలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, రఘువీరాపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ను బలోపేతం చేసేలా వ్యాఖ్యానించాల్సిన రఘువీరా.. అధికార, విపక్షాలపై ఆరోపణలు చేసి ఏం లాభమని అంటున్నారు. నంద్యాలలో కాంగ్రెస్‌కు ఉన్న సింపతీ ఓట్లను రాబట్టుకునేలా రఘువీరా మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. మరి రఘువీరా పద్ధతి మార్చుకుంటారో లేదో చూడాలి.