దేశంలో ఏ మూల అయినా సరే.. భూ సేకరణకు సంబంధించిన వ్యవహారం నడుస్తున్నదంటే చాలు, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదనే క్లారిటీ ఉంటే చాలు.. అక్కడ ఉద్యమం చేయడానికి రాహుల్ గాంధీ రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకువచ్చిన భూసేకరణ చట్టం గురంచి.. గత ఏడాదికాలంలో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా పోరాడిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తనికి ఆ భూసేకరణ చట్టంపై కేంద్రం వెనక్కు తగ్గింది. అంతా తమ ప్రతిభే అంటూ.. కాంగ్రెస పార్టీ టముకు వేసుకున్నది.
అంతా బాగానే ఉంది గానీ.. ఇప్పటికి కూడా.. అచ్చంగా మోడీ సర్కార్ తెచ్చిన కొత్త చట్టం , కొత్త నిబంధనల ప్రకారం కాకుండా.. మమూలు లేదా ఇతర పద్ధతుల్లో భూసేకరణ జరుగుతూ ఉన్నా కూడా.. దేశంలో అలాంటి ప్రతి చర్యనూ అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఉత్సాహపడుతున్నారు. ప్రతిచోటకు వెళ్లి.. రైతులకు అవగాహన కలిగించే ఎజెండా పేరిట.. ఆయన వారితో సమావేశం అవుతున్నారు. ఒక చిన్న వాకింగ్ యాత్ర - సారీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తిరిగి హస్తిన వెళుతున్నారు.
ఇలాంటి ప్రాసెస్ లో భాగంగానే.. రాహుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నారా.. అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా భూసేకరణకు సంబంధించిన వ్యవహారాలు నడుస్తున్నాయి. అటు విజయనగరంలో భోగాపరం విమానాశ్రయం కోసం, ఇటు కుప్పంలో మరొక విమానాశ్రయం కోసం భూమిని ప్రభుత్వం సేకరిస్తున్నది. ఈరెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నది. భోగాపురంలో అయితే భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి రాహుల్ గాంధీని - సోనియాను కూడా తీసుకువస్తాం అని రఘువీరారెడ్డి అక్కడ జనాలకు హమీ ఇచ్చేశారు.
ఇప్పుడు కుప్పంలో విమానాశ్రయానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. కుప్పంలో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి రాహుల్‌ను ఆహ్వానించడానికి ఏపీసీసీ ఆలోచన చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఒకవేళ అది కార్యరూపం దాలిస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలో ఉద్యమం చేయడానికి రాహుల్ స్వయంగా కుప్పందాకా వస్తారా.. ఒకవేళ వచ్చినా సరే.. ఆయన పార్టీ ఆశించినంత ప్రయోజనం అక్కడ దక్కుతుందా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.