వివాదాలతో పబ్లిసిటీని పొందడంలో వర్మను మించిన డైరెక్టర్ మరొకరు వుండరు. గతంలో బెజవాడ రౌడీలు అనే టైటిల్ తో సినిమా తీస్తానన్నప్పుడు... వర్మను ఎంతమంది తిట్టిపోశారో అందరికీ తెలిసిందే. చివరకు తన చిరకాల మిత్రుడు లగడపాటి రాజగోపాల్ బెజవాడ రౌడీలులో రౌడీలు అనే పదం తొలగించమని సూచించడంతో... తన మిత్రుని కోరిక మేరకు రౌడీలు అనేపదం తొలగించి కేవలం ‘బెజవాడ’ అని పేరు పెట్టాడు. అఫ్ కోర్స్ ఆ సినిమా ఆడలేదనుకోండి. అలాగే అంతకు ముందు పరిటాల రవి జీవిత కథ ఆధారంగా సినిమా చేస్తున్నానగానే అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. అయితే ఆ సినిమా విషయంలో ప్రధాన వర్గాలైన పరిటాల, మద్దల చెరువు సూరి నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినా... ఓబుల్ రెడ్డిని విలన్ గా చూపించారని అతని కుటుంబ సభ్యులు వర్మకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇలాంటి బెదిరింపులకు వర్మ అసలు భయపడలేదు.
తాజాగా విజయవాడ నేపథ్యంలో వంగవీటి అనే పేరుతో సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ఇప్పుడు వర్మకు పెద్ద వార్నింగులే వెళుతున్నాయి. చాలా మంది బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా వర్మ భయపడలేదు. ఈ రోజు విజయవాడ వెళ్లి... దేవినేని నెహ్రూ, వంగవీటి కుటుంబాలను కలవనున్నాడు. దాంతో ఇప్పుడు విజయవాడలో ఒకటే టెన్షన్. ఇంతకు ముందే వర్మ... నేను ఈనెల 26న విజయవాడ వస్తున్నా. పలానా ఫ్లైట్లో వస్తున్నా, నేను బస చేసే హోటల్ ఇదే. ఎవరొస్తారో రండి అంటూ ట్విట్టర్ ద్వారా సవాల్ కూడా విసిరాడు. వీటిపై బెజవాడ యూత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏపీ సీఎం కూడా విజయవాడలో వుంటున్నారు. మరి అక్కడ లాండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్టుగా మెయింటైన్ చేస్తోంది పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకపోవచ్చని అంటున్నారు. వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో.