ఆ దేశ పార్లమెంటులో మహిళపై రేప్

Update: 2021-02-16 11:41 GMT
దేశం ఏదైనా కావొచ్చు.. పార్లమెంటును పవిత్రమైన దేవాలయంగా అభివర్ణిస్తారు. కట్టుదిట్టమైన భద్రతతో పాటు.. దేశ సార్వభౌమాధికారానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే పార్లమెంటు భవనంలో ఒక మహిళకు దారుణమైన పరిస్థితి ఎదురైంది. సమావేశానికి రమ్మని పిలిచి.. తోటి ఉద్యోగి పార్లమెంటు భవనంలో ఆమెపై అత్యాచారం చేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. పెను సంచలనంగా మారటమే కాదు.. ఆస్ట్రేలియా పార్లమెంటు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి తాజాగా చోటు చేసుకుంది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వైనంపై దేశ ప్రధాని స్కాట్ మారిసన్ షాక్ కు గురి కావటమే కాదు.. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పారు. ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాదాపు రెండేళ్ల క్రితంఅంటే.. 2019లో మార్చిలో పార్లమెంటు భవనంలో తనపై అత్యాచారం జరిగినట్లుగా ఒక మహిళ బాంబు పేల్చింది. రక్షణ మంత్రి లిండా రెనాల్డ్ కార్యాలయంలో తనపై రేప్ జరిగినట్లుగా వెల్లడించింది. అత్యాచారంపై పోలీసులకు ఈ ఏడాది ఏప్రిల్ లో తాను చెప్పినట్లుగా వెల్లడించింది. రెనాల్డో కార్యాలయంలో పని చేసే సీనియర్సిబ్బంది ఒకరు మీటింగ్ ఉందని పిలిస్తే వెళ్లానని.. అనంతరం తనపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపించింది.

రేప్ పై తాజాగా రక్షణ మంత్రి స్పందించారు. అత్యాచారం జరిగిన మాట వాస్తవమే కానీ.. కేసు పెట్టకుండా ఆమెపై ఎవరూ ఒత్తిడి పెట్టలేదని బాధితురాలే తనకు స్వయంగా చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. ఒక దేశ పార్లమెంటు.. అందునా ఆస్ట్రేలియా లాంటి దేశంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.




Tags:    

Similar News