రేషన్ షాపుల్లో క్యాష్ లెస్సా?

Update: 2016-12-20 04:27 GMT
నగదు రహితం (క్యాష్ లెస్) అని నిన్నటివరకూ ఒకమాట దేశం మొత్తం వినిపించింది. అది కాస్త ఇప్పుడు లెస్ క్యాష్ అయ్యింది. అయితే ఈ విషయంలో మధ్యతరగతి కుటుంబాలకు - ఆ పైవారికి క్యాష్ లెస్ అన్నా లెస్ క్యాష్ అన్నా అర్ధం అవుతుంది - దాని వెనుక ఉన్న సాదకబాదకాలు అర్ధం చేసుకోగలరు కాస్త కష్టమైనా ఆచరణలో పెట్టడానికి సహకరించగలరు కూడా! అయితే రేషన్ షాపుల్లో సరుకుల కోసం క్యూలో నిలబడే వారిలో ఎంతమందికి నగరు రహితంపై అవగాహన ఉంటుంది. వారిలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, వాటిపై అవగాహన ఉంటుంది.. వారి ప్రమేయం లేకుండానే నేరుగా బ్యాంక్ నుంచి రేషన్ షాపుకు డబ్బులు కట్ అయిపోతాయంటే వారు రిసీవ్ చేసుకోగలరా? అయితే... ఈ నిర్ణయాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది!

ఈ క్రమంలో తాజాగా జిల్లా యంత్రాంగాలను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఏ ఒక్క షాపులో నగదు లావాదేవీ జరగరాదని స్పష్టం చేసింది. ఎవరైతే రేషన్ సరుకులు తీసుకెళుతున్నారో ఆ కార్డులోని భర్త/భార్యలో ఒకరితో సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాని సమీపంలోని బ్యాంకులో తెరిపించాల్సిందిగా అధికారులను ఆదేశించి, ఈ బాధ్యతను కలెక్టర్ లకు అప్పగించింది. దీంతో ముందుగా డీలర్లందరితో ఆంధ్రాబ్యాంకులో కరెంట్‌ అకౌంట్లను తెరిపించారట. డీలర్ల సంగతి కాసేపు పక్కనపెడితే... రేషన్ సరుకులు పొందుతోన్న కార్డుదారులందరికీ క్యాష్ లెస్ విధానమే అంటే సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. దేశం మొత్తంలో ఇప్పుడే క్యాష్ లెస్ అనో లెస్ క్యాష్ అనో ఒక విధానం మొదలైంది. ఆ కార్యక్రమాన్ని మరీ దిగువ మధ్యతరగతి - బీద వారి వరకూ ఉన్నఫలంగా అమలు చేయాల్సిన అవసరమేమిటో అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ప్రధాన పట్టణాలు - మెట్రోపాలిటన్ సిటీలు - పట్టణాల్లోనే నగదు రహితం అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తున్న సమయంలో... గ్రామాల్లోని రేషన్ షాపుల్లో నగదు రహితం అనడాన్ని ఏమనుకోవాలి?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News