కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాపంగా లాక్ డౌన్ విధించగా ఏప్రిల్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థదీ అదే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి పెద్ద ఆలోచనలే చేయాలి. ఈ క్రమంలో ఆర్థికవేత్తలు - నిపుణులు లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలో ఆలోచనలు మొదలుపెట్టారు. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు తాను సహకరిస్తానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. భారత్ కు ఆహ్వానిస్తే వచ్చి పని చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా తన బ్లాగ్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
లాక్ డౌన్ తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోగా.. అన్ని రంగాలు మూగబోయాయి. బ్యాంకింగ్ - ఏవియేషన్ - పర్యాటకం - సినిమా - మార్కెటింగ్ తదితర రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో భారత్ కోలుకునేందుకు తాను పని చేస్తానని తెలిపారు. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు భారత్ లో లేవని - ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని రాజన్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి పలు విషయాలు వెల్లడించారు. భారతదేశంలో మొదటి సమస్య విదేశీ మారకద్రవ్యంలో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశీ మారకం స్థిరంగా ఉందని, దీనికి ఆర్బీఐ ఇచ్చే సహకారం కారణం కావొచ్చునని తెలిపారు. డాలర్ తో పోలిస్తే ఇటీవల కొంత క్షీణించిందని చెప్పారు.
బ్రెజిల్ వంటి దేశాల్లో దేశాల్లో 25 శాతం క్షీణించిందని - మనకు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు. కరోనా వైరస్ పై పోరులో భారత్ లో భాగస్వామి కావడానికి సిద్ధమేనని - పిలిస్తే వస్తానని ఈ సందర్భంగా రాజన్ చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడగా తిరిగి కోలుకోవడం ఓ సవాల్. అయితే భారత ప్రభుత్వం ఆహ్వానిస్తే దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. అమెరికా - ఇటలీ తరహాలో భారత్ లో కరోనా ప్రభావం చూపిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయని - ఆర్థిక మాంద్యానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటే వచ్చే సంవత్సరం కోలుకోవచ్చునని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి తీరుపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అన్నింటినీ నడపలేమని రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం అన్నింటిని నడపాలని పట్టుబడితే సరికాదని - ఆలస్యమవుతుందని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఈ రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. దేశంలో ఇలాంటి వారు చాలామంది ఉన్నారని - వారి సేవలు తీసుకోవాలని చెప్పారు.
అయితే రఘురాం రాజన్ గతంలో ఆర్బీఐ గవర్నర్ గా పని చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వానికి - ఆర్బీఐకి మధ్య కొన్ని విషయాల్లో జరిగిన సంవాదంతో ఆయన తన పదవీకాలం పూర్తి చేసుకుని విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థను చూసి స్పందించారు. రఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలు - సలహాలు తీసుకుంటారో లేదో చూడాలి.