గత ఏడాది కరోనాతో మనదేశం విలవిలలాడింది. రోజుకు వేలసంఖ్యలో కేసులు నమోదయ్యేవి. కరోనా కేసుల్లో అమెరికాను కూడా దాటేయబోతున్నదన్న ఊహాగానాలు వచ్చాయి. భారత్లో కరోనా విజృంభిస్తే .. మనకున్న వైద్యులు, ఆస్పత్రులు సరిపోవని.. అగ్రరాజ్యం అమెరికానే కరోనాను తట్టుకోవడం లేదు. ఇక భారత్లో కేసులు పెరగిపోతే పరిస్థితి ఏమిటి? అన్న చర్చ సాగింది. అయితే ఎట్టకేలకు భారత్ కరోనాను అధిగమించింది. గతేడాది సెప్టెంబర్‌లో మనదేశంలో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడా సంఖ్య 10వేలకు పడిపోయింది.
ప్రస్తుతం అమెరికాతో పోల్చుకుంటే భారత్లో కేసులు, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. భారత్లో కరోనా కట్టడి ఎలా సాధ్యమైంది? అనే అంశంపై అమెరికాకు చెందిన
'హ్యూమన్ బారికేడ్' యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌కి చెందిన ఎపిడిమిలాజిస్ట్ భ్రమర్ ముఖర్జీ పరిశోధనలు సాగిస్తున్నారు. ఆయన చేస్తున్న అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
ఈ ఏడాది మార్చినాటికి భారత్లో కరోనా కేసులు మరింత తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.
భారత్ కరోనాను ఎలా ఎదుర్కొంది? అనే అంశంపై సీరోలాజికల్ సర్వే కూడా నిర్వహించారు. అయితే ఇప్పటికే భారత్లో 21.5 శాతం మంది కరోనా బారిన పడి ఉండొచ్చని తేలింది. ఇదిలా ఉంటే భారతీయులుకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండటం, దేశంలో యువత సంఖ్య ఎక్కువగా ఉండటం..
తదితర కారణాల వల్ల ఇక్కడ కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటచనా వేస్తున్నారు.
అయితే మనదేశంలో బ్రిటన్ స్ట్రెయిన్ కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. వ్యాక్సినేషన్ కూడా ముమ్మరంగా సాగుతున్నందున ఈ దేశంలో కరోనా పూర్తిగా పోయే అవకాశం ఉందని శాస్త్రవవేత్తలు అంచనా వేస్తున్నారు.