విచిత్రమైన ఉదంతం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. పేరు చివర ఉండాల్సిన రెడ్డి అనే పదం.. ఆధార్ కార్డులో లేకపోవటాన్ని సీరియస్ గా తీసుకున్న పెళ్లి కొడుకు పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవటం సంచలనంగా మారింది. ఇప్పుడీ పంచాయితీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరింది. ఇంతకీ ఈ విచిత్ర ఉదంతం ఎక్కడ చోటు చేసుకుందంటే..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి క్రోసూరు మండలం గాదెవారి పాలెం గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత.. సరిగ్గా పెళ్లి టైం వేళలో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. పెళ్లి వేడుక కోసం అందరూ వేదిక వద్దకు చేరుకున్న వేళ.. ఆధార్ కార్డులో వధువు పేరు చివర ఉండాల్సిన రెడ్డి లేదన్న విషయాన్ని గుర్తించాడు పెళ్లి కొడుకు.
పెళ్లి కుమార్తె ఆధార్ కార్డుతో పాటు.. ఆమె తండ్రి ఆధార్ కార్డులోనూ పేరు చివర రెడ్డి అన్న పదం లేకపోటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లి కొడుకు.. తాను పెళ్లి చేసుకోనని తేల్చేశాడు. ఆధార్ లో పేరు చివర రెడ్డి పదం లేని నేపథ్యంలో తాను పెళ్లి చేసుకోనని అలిగి వెళ్లిపోయాడు. దీంతో.. పెళ్లి కుమార్తె తరఫు వారు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇప్పుడీ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.