భ‌ర్త అన్న‌తోనే సంబంధం.. చంపేసి క‌రోనాతో పోయాడ‌న్న‌ది.. కానీ

Update: 2021-04-10 17:30 GMT
మ‌హాన‌టిని మించిన పెర్ఫార్మెన్స్ ఈమెది.. మ‌హాన‌టుడిని త‌ల‌ద‌న్నే న‌ట‌న ఆయ‌న‌ది.. ప‌క్కా స్క్రిప్టు.. అద్భుత‌మైన‌ స్క్రీన్ ప్లే.. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. క్రైమ్‌ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిపోయింది. క‌థ‌సుఖాంతం అనుకునే స‌మ‌యంలో చిన్న ట్విస్ట్‌. బాక్స్ బ‌ద్ద‌లైపోయింది.. విష‌యం గ‌డ గ‌డ గ‌డా కారిపోయింది!

భ‌ర్త 45 సంవ‌త్స‌రాలు. ఈమెకు ఓ న‌ల‌భై చిల్ల‌ర‌. ఈమె భ‌ర్త‌కు ఓ అన్న ఉన్నాడు. అత‌నికి 50 సంవ‌త్స‌రాలు. ఎప్పుడు క‌లిసిందో తెలియ‌దుగానీ.. వీరిద్ద‌రి లంకె కుదిరింది. పాపం.. ఈ విష‌యాన్ని గుర్తించ‌లేదు అమాయ‌క భ‌ర్త క‌మ్‌ త‌మ్ముడు. అన్న‌తో క‌లిసి నిర్మాణ రంగంలో (బిల్డ‌ర్‌) వ్యాపారం చేస్తున్నాడు. డ‌బ్బుకు లోటు లేదు. రాష్ట్రాల‌ను దాటి వ్యాపారం సాగుతోంది.

అవ‌స‌రాల‌కు లోటు లేన‌ప్పుడు కోరిక‌లు గుర్రాలైపోతాయి క‌దా..! అత‌ని భార్య కండీష‌న్ కూడా అదే. ఇంకా ఎన్నాళ్లు ఈ చాటుమాటు వ్య‌వ‌హారాలు అనుకున్నారు అత‌ని భార్య‌-అన్న‌. రూట్ క్లియ‌ర్ చేసుకోవాలంటే.. మ‌ధ్య‌లో ఉన్న భ‌ర్త‌ను లేపేయ‌డ‌మే మార్గం అని ఆమె బావ‌తో చెప్పింది. ఇద్ద‌రూ చ‌ర్చించుకొని రాజ‌స్థాన్ కు చెందిన ఓ కిల్ల‌ర్ కు సుపారీ ఇచ్చారు. మొత్తం 12.5 ల‌క్ష‌లు.

అంతా ఓకే అనుకున్న త‌ర్వాత ఓ రోజు రాజ‌స్థాన్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. అక్క‌డ అద్భుత‌మైన సైట్ ఉంది చూసివ‌ద్దాం అని త‌మ్ముడితో చెప్పాడు అన్న‌. నిజ‌మేన‌ని న‌మ్మిన త‌మ్ముడు బయ‌ల్దేరి వెళ్లాడు. మార్గం మ‌ధ్య‌లో కొంద‌రు క‌లిశారు. వారు త‌న ఫ్రెండ్స్ అని ప‌రిచ‌యం చేసిన అన్న‌.. కారులో ఎక్కించుకున్నారు. ఈ క్ర‌మంలోనే భార్య డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి భ‌ర్త‌కు అందించింది. తాగిన భ‌ర్త‌.. మ‌త్తులోకి జారుకున్నాడు. మిగిలిన ప‌ని కిల్ల‌ర్స్ పూర్తి చేశారు. బాడీని నీళ్ల‌లో ప‌డేశారు.

శ‌వం తేలింది. విష‌యం పోలీసుల‌కు చేరింది. ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. కానీ.. ఆధారాల్లేవ్‌. ఈ క్ర‌మంలోనే క‌రోనా పెరిగింది. లాక్ డౌన్ కూడా వ‌చ్చింది. త‌మ్ముడి భార్య‌, అన్న ఇంటికి వెళ్లారుగానీ.. త‌మ్ముడు రాలేదు. ఏంట‌ని ఇంట్లో వాళ్లు అడిగితే.. ప‌నిచూసుకొని వ‌స్తాన‌న్నాడ‌ని చెప్పారు. ఎంత‌కీ రాలేద‌ని అడిగితే.. క‌రోనా వ‌చ్చింది ఆసుప‌త్రిలో ఉన్నాడ‌ని చెప్పారు. చివ‌ర‌కు ఆసుప‌త్రిలోనే చ‌నిపోయాడని క‌థ ముగించేశారు. డెడ్ బాడీ కూడా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని అధికారులు చెప్పార‌ని కాంక్రీట్ ఆన్స‌ర్ ఇచ్చేశారు. అంద‌రూ ఏడ్చారు.. నిజ‌మేన‌ని న‌మ్మారు.

ట్విస్ట్ ఎంట్రీ ఇచ్చింది. మొగుడు చ‌చ్చాడు. కాదు కాదు.. చంపేశారు. భ‌ర్త పోతే ఆస్తి భార్య‌కే క‌దా! ఇదే హ‌క్కుతో వెళ్లి నా పేరున రాయండి అని అడిగింది. మీ ఆయ‌న చ‌నిపోయిన‌ట్టు ఆధార‌మేంట‌ని అడిగారు. డెత్ స‌ర్టిఫికెట్ అనివార్య‌మైంది. ఛ‌లో రాజ‌స్తాన్ అంటూ టూర్ వేశారు. అక్క‌డే క‌రోనాతో పోయిన‌ట్టు స‌ర్టిఫికెట్ త‌యారు చేయించే ప‌నిలో ప‌డ్డారు. అధికారితో బేరం మొద‌లు పెట్టారు. ఎంత‌కావాల‌న్నా ఇస్తా.. మాకు మాత్రం స‌ర్టిఫికెట్ ప్లీజ్ అన్నారు. నెక్స్ట్ డే రండి ప్లీజ్ అని ఆయ‌న చెప్పాడు. ఈ లోగా.. పోలీసుల‌కు ఫోన్ చేసి, ఇదేదో తేడా య‌వ్వారంలా ఉంది చూడండి ప్లీజ్ అన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాక్సు బ‌ద్ద‌లు చేస్తే.. విష‌యం గ‌డ‌గ‌డ‌గ‌డా కారిపోయింది. అద‌న్న‌మాట సంగ‌తి.
Tags:    

Similar News