పునర్విభజన: లాభం టీఆర్ ఎస్ కా.? బీజేపీకా?

Update: 2019-08-28 17:30 GMT
ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలతో ఏపీ, తెలంగాణలో అధికార పార్టీల్లో చేరిన ఆశావహులు సంబరపడుతున్నారు. బీజేపీ లీకులను బేస్ చేసుకొని తమ నియోజకవర్గాలను ఎంచుకునే పనిలో పడ్డారు.

తెలంగాణలో బీజేపీ కనుక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే అది టీఆర్ ఎస్ కే భారీ లాభం చేకూరుతుందని టీఆర్ ఎస్ అనలిస్టులు ఘంఠాపథంగా చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ను ఖాళీ చేసి అంతా గులాబీ పార్టీలో చేరారు. బీజేపీ, వామపక్షాలు, టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరారు. ఇప్పుడు టీఆర్ ఎస్ కారు ఓవర్ లోడ్ తో ఉంది.. బీజేపీ కనుక నియోజకవర్గాల పునర్విభజన చేస్తే వీరందరికీ న్యాయం చేయడానికి సీట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు వీలుచిక్కతుందట.. అందుకే బీజేపీ నియోజకవర్గాల విభజన టీఆర్ఎస్ కే లాభమని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు..

ఇక విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పెట్టుకున్న బీజేపీకి ఈ నియోజకవర్గాల పెంపుతో తమకే లాభం అని లెక్కలు వేసుకుంటోంది. బలమైన కుల, మత, ప్రాంత భాగాలను వేరు చేయడం ద్వారా.. పునర్విభజనతో టీఆర్ ఎస్ ఓటు బ్యాంకును చెల్లాచెదురు చేసి ఓట్లు చీల్చితే తమకే లాభం అని బీజేపీ యోచిస్తోందట..

మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం చుట్టూ ఆశావహులు భారీ ఆశలు పెంచుకున్నారు. గులాబీపార్టీ తమకే ఇది మేలు చేస్తుందని భావిస్తోంది. కమలం పార్టీ కూడా చీల్చితే బీజేపీకే లాభమంటోంది. మరి అంతిమంగా నియోజకవర్గాల పునర్విభజన ఏపార్టీకి మేలు చేస్తుందనేది వేచిచూడాలి.
   

Tags:    

Similar News