రేణుకా చౌదరి ఇంట్లో దోపిడీ..భారీగా నగలు, నగదు మాయం

Update: 2020-10-14 06:15 GMT
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి ఇంట్లో దోపిడీ దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో గల ఆమె నివాసంలో రూ.3 లక్షల నగదు.. మరో మూడున్నర లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు రేణుకా చౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

రేణుకా చౌదరి ఫిర్యాదు మేరకు మంగళవారం రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రేణుక తమ ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ వారిపై ఫిర్యాదు చేశారు.

పోలీసులు రేణుకా చౌదరి ఇంట్లో పనిచేసే వారిని పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

కాగా రేణుకా చౌదరి ఇంట్లోని వారా? లేక బయటివారి పనా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. లేక బయటి వారు దొంగలు ఎవరైనా చొరబడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు రేణుకా చౌదరి నివాసంతోపాటు స్థానిక సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News