దేశానికి స్వాతంత్రం వచ్చినది ఎపుడూ అంటే ఒకటవ క్లాస్ చదివే కుర్రాడు కూడా ఠక్కున చెబుతాడు. బ్రిటిష్ వారు ఈ దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ఇచ్చారన్నది చరిత్ర పుస్తకాలు చెబుతాయి. ఇక గూగులమ్మ తల్లికి అడిగితే ఎంచక్కా మొత్తం జాతకమే చెబుతుంది. మరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం కాస్తా తేడాగానే ఈ సంగతి చెబుతున్నారు అదేంటి దాని కధేంటి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
రోజా లేటెస్ట్ గా జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ గొప్పతనాన్ని సభలో వివరించే ప్రయత్నం చేశారు. ఆయన పాలనాప్రతిభ గురించి చెప్పాలీ అంటే సీరియల్స్ మీద సీరియల్స్ తీయాల్సిందే అంటూ చెప్పుకొచ్చారు. అదే ఊపులో ఆమె దేశ స్వాతంత్రం ప్రస్తావన కూడా తీసుకువచ్చారు.
ఈ దేశానికి బ్రిటిష్ వారు 1947లో స్వాతంత్రం ఇచ్చారని కరెక్ట్ గానే చెప్పారు. కానీ ఏపీకి మాత్రం 2004 దాకా స్వాతంత్రం రాలేదని ట్విస్ట్ ఇచ్చేశారు. అక్కడే అందరికీ డౌట్ కొట్టింది. ఈ దేశంలో ఏపీ భాగం కాదా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే రోజమ్మ చెప్పే గొప్ప కబురు ఏంటి అంటే వైఎస్సార్ ఏలుబడి ఉమ్మడి ఏపీలో మొదలయ్యేదాకా ఏపీకి స్వాతంత్రం రాలేదు అని. ఒక విధంగా వైఎస్సార్ ని పొగుడుతూ రోజా చేసిన కామెంట్స్ ఇవి.
అయితే అదే సందర్భంలో ఆమె మరచిపయిన విషయాలు ఏంటి అంటే ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో ఉమ్మడి ఏపీ నాయకులు, అమరవీరులు కూడా ఉన్నారు. వారంతా కూడా వచ్చిందని కూడా భావించి మురిసి పోయారు. అలాంటి వారి త్యాగాలని కించపరచేలా రోజమ్మ కామెంట్స్ ఉన్నాయని కూడా దేశభక్తులు అంటున్నారు అంటే అశ్చర్యం ఏముంది.
అంతే కాదు, వైఎస్సార్ గొప్ప లీడరే. అందులో రెండవ మాటకు తావు లేదు, కానీ ఉమ్మడి ఏపీని ఆయన కంటే ముందు బాగానే ఏలిన సీఎంలు కూడా చాలా మంది ఉన్నారు. వారిలో టంగుటూరి ప్రకాశం లాంటి సేవలను ఎవరైనా కాదనగలరా, అలాగే నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, ఎన్టీయార్ లాంటి ఉద్దండులను ఎవరైనా మరచిపోగలరా.
అందరూ కలిస్తేనే ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో సాగింది. అయితే రోజమ్మ ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది. సంక్షేమం విషయంలో వైఎస్సార్ హద్దులు లేని విధంగా సంతృప్తికర విధానంలో అందరికీ అమలు చేసి చూపించారు అంటే బాగుండేది. అంతే తప్ప ఒక రాష్ట్ర పాలన విషయంలో వైఎస్సార్ లాంటి వారిని పొగడాలనుకుని ఏకంగా రాష్ట్రానికే స్వాతంత్రం 2004 దాకా రాలేదు అంటే అది చాలా పెద్ద మిస్టేక్ అనే అంటున్నారు.
ఇక పంచ్ డైలాగులు వేయాలన్న అతి ఉత్సాహాంతో రోజమ్మ ఇలా అన్నా కూడా అది అమర వీరుల త్యాగాలను, దేశ భక్తుల హృదయలాను రగిలించేదే అన్న మాట అయితే ఉంది మరి. మొత్తానికి ఒక్క మాట అనాలిపుడు. నాయకులను పొగిడే విషయంలో నేతలు అన్నీ హద్దులూ దాటేయడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని. అంతే.