ఒక నిర్ణయం చాలు.. సీన్ మొత్తం మారిపోవటానికి. రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలే వారి ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తాయని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పవర్లోకి వస్తుందని భావించిన కొందరు టీఆర్ఎస్ ను వీడి బయటకు రావటం.. ఇప్పుడు కిందామీదా పడటం తెలిసిందే.
టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఇలా అనుకోవటం మామూలే. అదే.. కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఇప్పుడు జీరోలుగా ఉన్న వారు హీరోలుగా చెలామణి అయ్యేవారు. ప్రతి ఒక్కరి అంచనాలు నూటికి నూరుశాతం నిజం కాకపోవచ్చు. కాకుంటే.. వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తే అంచనాలు అద్భుతమైన ఫలితాల్ని ఇవ్వటం పక్కా.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పటమంటే.. దివంగత మహానేత వైఎస్ కు దేవుడిచ్చిన చెల్లెమ్మలా చెలామణి అయిన సబితా ఇంద్రారెడ్డి సీన్ మొత్తం కొద్ది రోజుల్లో మారిపోతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఆమె త్వరలో టీఆర్ ఎస్ లో చేరుతుందన్న మాట గడిచిన కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి వాదనలో ఎలాంటి నిజం లేదని ఆమె చెబుతున్నా.. రానున్న రోజుల్లో ఆమె గులాబీ కారు ఎక్కటం కాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇన్నిసార్లు ఆమె కొట్టిపారేసిన తర్వాత.. ఇప్పుడీ వాదన వినిపించటానికి కారణం లేకపోలేదు. మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేసేందుకు కేసీఆర్ డిసైడ్ కావటమేనని చెబుతున్నారు. హోంమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్.. సబితమ్మకు ఆ పదవిని ఆఫర్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఆమె.. పార్టీ మారే విషయంపై ఏటూ తేల్చుకోలేపోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తన కుమారుడి విషయంలో కేసీఆర్ ఇచ్చే హామీకి తగ్గట్లు ఆమె తుది నిర్ణయం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి అసెంబ్లీ సీటును ఆశించటం.. ఆందుకు కాంగ్రెస్ అధినాయకత్వం నో చెప్పటం తెలిసిందే. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సబితకు హోంమంత్రి పదవి.. ఆమె కుమారుడికి రానున్న ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వటంపై కేసీఆర్ పూర్తి సానుకూలత ప్రదర్శిస్తే.. రానున్న రోజుల్లో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ కావటం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్న ఆమె.. పవర్ ఫుల్ కానున్నారా? ఇప్పటిలానే సైలెంట్ గా ఉండనున్నారా? అన్నది కాలం తేల్చనుంది.