కొన్ని ఫొటోలు అత్యంత ఆసక్తి రేపుతాయి. వాటికి క్యాప్షన్లు అవసరం లేదు. కేవలం అందులోని వ్యక్తులను చూస్తే చాలు. కళ్లార్పకుండా అలానే ఉండిపోతాం. మరి ఆ ఫొటోల్లోని వారు ప్రముఖులైతే..? అందులోనూ క్రీడా దిగ్గజాలైతే..? చెప్పేదేముంది? అలాంటి సీన్ లండన్ వేదికగా చోటుచేసుకుంది. ఒకే ఫ్రేములో వారిద్దరినీ బంధించిన అభిమానులు.. ఆ ఫొటోను చూసిన క్రికెట్ ప్రేమికులు పరవశులైపోతున్నారు.
లండన్ వీధుల్లో కుడి ఎడమల వీరవిహారం
బ్రయాన్ లారా (వెస్టిండీస్), సచిన్ టెండూల్కర్ (భారత్) వీరి గురించి చెప్పేదేముంది..? కుడిచేతి వాటం సచిన్, ఎడమచేతి వాటం లారా తమ హయాంలో ప్రపంచ దిగ్గజాలుగా పేరొందారు.
ఇద్దరూ ఇద్దరే ఎవరినీ తక్కువ చేయలేం.. ఎక్కువని చెప్పలేం. అందుకేనేమో? ఇద్దరికీ వేర్వేరు బ్యాటింగ్ స్టయిల్ (కుడి-ఎడమ) ఇచ్చాడు దేవుడు. తాజాగా లారా, సచిన్ లండన్ లో ఉన్నారు. ఇద్దరూ కలిసి నివాసాలను వదిలి బయటకు వచ్చి విహరిస్తున్నారు.
యాషెస్ కా..? వింబుల్డన్ కా..?
ప్రస్తుతం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ జరుగుతోంది. బుధవారం రెండో టెస్టు లార్డ్స్ లో మొదలైంది. ఇక మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నీ వింబుల్డన్ జరగనుంది. ఈ రెండు ఈవెంట్లనూ కళ్లారా చూడాల్సిందే. అందుకేనేమో..? లారా, సచిన్ లండన్ చేరుకున్నారు.
బక్రీద్ నాడు ''గోట్''లను చూడలేమంటూ ట్రోల్స్
రిటైరనప్పటికీ సచిన్, లారాపట్ల క్రికెట్ ప్రేమికుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. వారి స్థాయిని బట్టి అది సహజమే. దీనికి ఉదాహరణ వీరద్దరూ కలిసి ఉన్న ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో కనిపించగానే వచ్చిన మెసేజ్ లు, కామెంట్లు. క్రీడా పరిభాష లో గోట్ (GOAT)లు అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని. ఇక బక్రీద్ నాడే లారా, సచిన్ లండన్ వీధుల్లో విహరిస్తుండడాన్ని కొందరు '' 2 Goats roaming freely on Eid'' అని.. బక్రీద్ నాడు వారిని గోట్ లుగా పిలవడం సరికాదనే అర్థంలో ''Not the best day to call them GOAT'' అని మెసేజ్ చేస్తున్నారు.