కశ్మీర్ తీసుకో.. హైదరాబాద్ ఇవ్వం.

Update: 2018-06-26 11:08 GMT
కాంగ్రెస్ సీనియర్ నేత సైఫొద్దిన్ సోజ్ మరోసారి నోరుజారాడు. సోజ్ రచించిన ‘గ్లిమ్ప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్ ’ పుస్తకావిష్కరణ సభ సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ కశ్మీర్ ను పాక్ కు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘హైదరాబాద్ కు బదులు పాక్ కు కశ్మీర్ ను ఇచ్చేలా పటేల్ ప్రతిపాదించారు. అప్పటి పాక్ ప్రధాని లిఖ్వాత్ అలీఖాన్ తో చర్చలు జరిపేటప్పుడు పటేల్ హైదరాబాద్ ప్రస్తావన తీసుకురావద్దని కోరారు. హైదరాబాద్ బదులు కశ్మీర్ ను పాక్ తీసుకోవచ్చన్నారు. ఖాన్ యుద్ధ సన్నాహాలు ప్రారంభించినప్పటికీ పటేల్ మాత్రం ఆ దిశలో చర్యలు చేపట్టలేదని’ సోజ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమాజీ మంత్రి జైరాం రమేశ్ కూడా హాజరయ్యారు.

సోజ్ ఇలా నోరుపారేసుకోవడం ఇదే తొలిసారి కాదు.. ఇప్పటికీ ఆయన పాక్ మాజీ అధ్యక్షుడు ముషర్రాఫ్ ను సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశారు. అవి దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా సోజ్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాత్రం సోజ్ పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Tags:    

Similar News