కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే. ముంబయి పేలుళ్లలో దోషిగా నిరూపితమై.. ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్ ఉరికి కొద్దిరోజుల ముందు.. సల్మాన్ మాట్లాడుతూ.. అతన్ని ఉరి తీయకూడదని వ్యాఖ్యానించటం తెలిసిందే.
సల్మాన్ అప్పుడు చేసిన వ్యాఖ్యలపై రాజ్ ఠాక్రే తాజాగా ఫైరయ్యాడు. విషయాల మీద అవగాహన తక్కువని.. ఎప్పుడేం మాట్లాడతాడో కూడా తెలీదని.. చట్టాల గురించి తెలీదని.. అసలు బ్రెయినే లేదంటూ సల్మాన్ ను కడిగి పారేశాడు.
ప్రపంచంలో ఏం జరుగుతుందో రోజూ న్యూస్ పేపర్లు చూస్తే తెలుస్తుందని.. కానీ అవేమీ చూడకుండా యాకూబ్ మెమన్ ఉరిశిక్ష వద్దని ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించిన రాజ్ ఠాక్రే.. సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా ప్రశ్నిస్తారా? అంటూ నిలదీశారు. మెమన్ ఒక ఉగ్రవాదని.. వందలాది మంది ప్రాణాలు తీసిన వ్యక్తి అని.. అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష వద్దని సల్మాన్ ఎలా చెబుతారని ఫైరయ్యాడు. సల్మాన్ తండ్రి చాలా గౌరవమైన వ్యక్తి అని.. సల్మాన్ తండ్రిని మాత్రం పొగిడేశాడు. ఒకనాటి తన స్నేహితుడి గురించి రాజ్ ఠాక్రే ఫైర్ అయ్యాడు.