భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డ్యాన్స్ తో రచ్చ చేసింది. త్వరలో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న వేళ.. కొత్త జెర్సీని ధరించి చిందేసింది. జపాన్ రాజధాని టోక్యోలో ఈ నెల 23 నుంచి మొదలు కానున్నాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొనేందుకు ఆటగాళ్లు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తారో తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లు.. ఒలింపిక్ సమరానికి సిద్ధం అవుతుండడంతో.. అభిమానులతో ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ఇదే కోవలో సానియా మీర్జా కూడా సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో సానియా ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ విషయాలతోపాటు వృత్తిపరమైన విషయాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసింది. ఇందులో కొత్త ఒలింపిక్ జెర్సీని ధరించి డ్యాన్స్ చేసింది.
అమెరికన్ రాపర్ డోజా క్యాట్ హిట్ సాంగ్ ‘కిస్ మి మోర్’ కు క్యూట్ స్టెప్పేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి మంచి కామెట్ కూడా జతచేసింది. ‘‘నా పేరులో వచ్చే ఇంగ్లీష్ లెటర్ Aను విస్తరిస్తే.. అందులో చాలా జీవితం ఉంది. దూకుడు, ఆశయం, సాధించడం, ఆప్యాయత అన్నీ అందులో ఉన్నాయి’’ అని రాసుకొచ్చింది సానియా. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి లైకుల వర్షం కురుస్తోంది.
ఇక, టోక్యో ఒలింపిక్స్ లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో పోటీ పడుతోంది. అంకితా రైనాతో కలిసి బరిలో దిగనుంది సానియా. తాజాగా.. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సానియా.. టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఇందుకోసం కఠోర సాధన చేస్తున్నట్టు తెలిపింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి మొత్తం 228 మంది క్రీడాకారులు వెళ్లనున్నారు. ఈ నెల 17న 90 మంది ప్రత్యేక విమానలో బయలుదేరి వెళ్తారు. మిగిలినవారు మరోసారి వెళ్తారు. ఈ ఒలింపిక్స్ లో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 11 వేల మంది పాల్గొనబోతున్నారు.
Full View