తెలంగాణ రాష్ర్ట బ్రాండ్ అంబాసిడర్, టెన్నీస్ స్టార్ సానియా మిర్జాకు భారీ ఉపశమనం దక్కింది. క్రీడా రంగంలో అందజేసే ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు కేంద్రం సానియాను ఎంపికచేసిన సంగతి తెలిసిందే. అయితే సానియకు ఖేల్ రత్న ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పారా ఒలింపియన్ 2013లో పద్మశ్రీ పురస్కార గ్రహీత గిరీషా ఎన్ గౌడ కర్నాటక హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు అవార్డు బహుకరణపై స్టే విధిస్తూ కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సానియాకు ఖేల్ రత్నపై అనుమానాలు తలెత్తాయి.
అయితే కర్ణాటక హైకోర్టు నోటీసులందిన మాట నిజమేనని, దాని ప్రభావం అవార్డుల ప్రధానంపై ఉండదని క్రీడా శాఖ తేల్చి చెప్పింది. నోటీసులు అందిన 15 రోజుల లోపు అఫిడవిట్ దాఖలు చేస్తామని అధికారులు తెలపడంతో అవార్డు ప్రధానంపై క్లారీటీ వచ్చింది. దీంతో రాష్ట్రపతి భవన్ లో జరుగనున్న కార్యక్రమంలో సానియామిర్జా ఈ పురస్కారం అందుకోనుంది.
అవార్డు అందుకోవడానికి రెండ్రోజుల ముందు జరిగిన ఈ పరిణామాలు సానియాతో సహా క్రీడాభిమానులకు ఉత్కంఠను కలిగించాయి. మొత్తానికి సానియా అవార్డును అందుకోనుండటం సంతోషకరమని పలువురు పేర్కొంటున్నారు.