విశాఖలో కలకలం.. ప్రభుత్వ కార్యాలయంలో పెట్రోల్ దాడి

Update: 2020-03-07 10:00 GMT
తనకు రావాల్సిన వేతనం కోత విధించారని ఆరోపిస్తూ ఓ మహిళ ఏకంగా ప్రభుత్వ కార్యాలయం లో పెట్రోల్ దాడికి పాల్పడింది. ఈ ఘటన విశాఖపట్టణం లో కలకలం రేగింది. విశాఖపట్టణంలో ని జీవీఎంసీ కార్యాలయంలో జోన్ 6వ నెంబర్ పరిధిలోని కార్యాలయంలో శుక్రవారం ఈ పెట్రోల్ దాడి ఘటన చోటుచేసుకుంది. శానిటరీ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న అన్నామణి తనకు రావాల్సిన వేతనంలో అధికారులు కోత విధించి తనను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం కార్యాలయానికి పెట్రోల్ బాటిల్ తో వచ్చింది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఎంహెచ్‌ఓ లక్ష్మీతులసి పై పెట్రోల్ తో దాడికి పాల్పడింది.

అయితే వెంటనే గ్రహించిన అధికారిణి దాన్ని తప్పించుకుంది. ఆమెను గ్రహించిన వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై ఆమెను నిలువరించారు. దీంతో ప్రమాదం నుంచి తృటిలో అధికారిణి తప్పించుకుంది. జీవీఎంసీ జోన్ 6వ నంబర్ పరిధిలోని కార్యాలయంలో పెట్రోల్ దాడి ఘటనతో ఒక్కసారిగా విశాఖపట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. గోపాలపట్నం పరిధిలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అన్నామణికి కొన్నాళ్లుగా వేతనం రావడం లేదని ఆవేదన చెందుతూ ఈ ఘటనకు పాల్పడిందని తెలుస్తోంది.

దీనిపై అధికారిణి లక్ష్మీ తులసి స్పందించారు. అన్నామణి గతంలో 20 రోజుల పాటు విధులకు హాజరు కాకుండా సెలవు పెట్టిందని అందుకే, తన జీతంలో కోత విధించాల్సి వచ్చిందని వివరించారు. వేతనం చెల్లించకపోవడతోనే తనపై కక్ష పెంచుకోని అన్నామణి ఇలా పెట్రోల్‌తో దాడి చేసేందుకు యత్నించిందని అధికారిణి తెలిపారు. ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్యాలయంలో ఆందోళన ఏర్పడింది. గతంలో తెలంగాణలో రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ను కాల్చివేసిన దారుణ ఘటనను గుర్తుచేసుకున్నారు.
Tags:    

Similar News