కులవివక్ష: నేల మీద సర్పంచ్

Update: 2019-02-06 04:24 GMT
ఈ ఒక్క చిత్రం గ్రామాల్లో పేరుకుపోయిన కుల వివక్షను తేటతెల్లం చేస్తోంది. ప్రస్తుత సమాజ పోకడ చూస్తే ఇది నిజమనే అనిపిస్తోంది. తాజాగా గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికైన వ్యక్తి పంచాయతీ భవనంలో కింద కూర్చొని సమస్యలు వింటూ కనిపించారు. ఆయన పక్కనే అగ్రవర్ణ వ్యక్తులు కూర్చీల్లో కూర్చొని పంచాయితీ చెబుతున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సదురు సర్పంచ్ కు జరిగిన ఘోర అవమానం వైరల్ గా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలం పెదిరిపాడు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎస్సీ సామాజికవర్గానికి ఈ దఫా పెదిరిపాడు సర్పంచ్ రిజర్వేషన్ రాగా బాలప్ప పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో అగ్రవర్ణ సామాజికవర్గ పెద్దలు బాలప్పను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. సర్పంచ్ గా గెలిచాక పంచాయతీల్లో కనీసం ఆ పదవికైనా గౌరవం ఇచ్చి కుర్చీలో కూర్చుండబెట్టాల్సింది. కానీ ఆ అగ్రవర్ణ పెద్దలు సర్పంచ్ బాలప్పను కింద కూర్చుండబెట్టారు. పక్కనే వీరు కుర్చీల్లో కూర్చొని పంచాయతీ చెబుతున్నారు. బాలప్ప మాత్రం అమయాకంగా ఆ చర్చను వింటూ కనిపించారు. గ్రామాల్లో అధికారం మారినా.. కులవివక్ష ఏస్థాయిలో ఉంటుందనడానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యంగా కనపడుతోంది.
Tags:    

Similar News