అమ్మ మరణం తర్వాత పార్టీ మీదా.. ప్రభుత్వం మీద తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు జయలలిత నెచ్చెలి.. చిన్నమ్మ అవతరించిన శశికళ నటరాజ్. అమ్మ మరణం తర్వాత ప్రకటించిన సంతాప దినాలు కూడా పూర్తి కాక ముందే.. అన్నాడీఎంకే చీఫ్ పదవిని టార్గెట్ చేసిన చిన్నమ్మ.. అందుకు తగ్గట్లే పావులు కదపటం తెలిసిందే. ముఖ్యమంత్రి నియామకం సందర్భంగా కీలక భూమిక పోషించిన శశికళ..అనంతరం పార్టీపైనా తన పట్టును నిలుపుకునేందుకు గడిచిన కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అమ్మకు చెందిన పోయెస్ గార్డెన్ లో కొలువు తీరిన చిన్నమ్మ.. ముఖ్యమంత్రి మొదలు.. పార్టీ ఎమ్మెల్యేల విశ్వసనీయతను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ.. తనకు వ్యతిరేకంగా వినిపించే గళాల మీద ప్రత్యేక ఫోకస్ చేస్తున్న వైనం తమిళ రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చగా మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టేందుకు వీలుగా.. తనన నాయకత్వాన్ని ఓకే చేసేలా శశికళ పావులు కదుపుతున్నారు.
దీనికి తగ్గట్లే పార్టీ ఎమ్మెల్యేలు పలువురు.. చిన్నమ్మను పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కోరుతూ.. తమ విధేయతను ప్రదర్శిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. జయలలిత మరణంతో 234 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో అధికార అన్నాడీఎంకే పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. విపక్ష డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 8 మంది.. ఐయూఎంఎల్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక.. అధికారపక్షానికి చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే శశికళకు తమ మద్దుతును ప్రకటించారు.
తాజాగా 130 మంది ఎమ్మెల్యేలు జట్టుగా చిన్నమ్మ ఉంటున్న జయ నివాసమైన పోయెస్ గార్డెన్ కు వచ్చి.. పార్టీ పగ్గాలు ఆమె చేపట్టాలంటూ అభ్యర్థించారు. మరోవైపు జయలలిత వారసత్వానికి శశికళే అనేలా తమవద్ద తగిన ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి.. మాజీ మంత్రి పొన్నయ్యన ప్రకటించారు. అవకాశం వచ్చినప్పుడు అంతులేని విధేయతను ప్రదర్శిస్తే.. పదవులు దక్కుతాయి. ఆ విషయం అన్నాడీఎంకే నేతలకు తెలీదా..? ఇక.. మొత్తం ఎమ్మెల్యేల్లో ఐదుగురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. ఆ ప్రక్రియ పూర్తి కావటం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. కాకుంటే.. చిన్నమ్మకు తమ మద్దతు తెలపని ఐదుగురు ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/