ఎడారిలో మంచువర్షం

Update: 2016-12-02 08:19 GMT
 స్వెట్లర్లు వేసుకుని - ఒండినిండా రగ్గు కప్పుకుని - తలకు మఫ్లర్ చుట్టుకుని ఎడారిలో ఎవరైనా కనిపిస్తారా...? అసాధ్యం. ఎడారి అంటే తడారిపోయిన ప్రాంతం. చర్మం కమిలిపోయేటంతటి వేడి ఉండే అలాంటి చోట స్వెట్టరెవరు వేసుకుంటారు.. మఫ్లరెవరు చుట్టుకుంటారు. కానీ... సౌదీ అరేబియా ఎడారిలో మాత్రం విచిత్రంగా ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. అక్కడ ఉష్ణోగ్రతలు -3 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పడిపోవడమే కాకుండా విపరీతంగా మంచుకురుస్తుండడతో జనం తమ సహజ జీవనశైలికి భిన్నంగా గడుపుతున్నారు.

ఇంతకాలం ఇళ్లలో ఏసీలను నిత్యం ఆన్ చేసి ఉంచే అక్కడి పౌరులు ఇప్పుడు ఏసీలకు బదులు హీటర్లు వాడుతున్నారు.  సాధారణంగా అక్కడ అక్టోబర్ నెల వరకు ఓ మాదిరి వర్షపాతం ఉంటుంది. కానీ ఈసారి డిసెంబరు వచ్చేసినా విపరీతంగా వర్షాలు పడుతుండడమే కాకుండా అతి శీతల వాతావరణమేర్పడింది.   కొత్తగా కురుస్తున్న మంచుతో సౌదీ అరేబియన్లు, అక్కడ ఉంటున్న ఇతర దేశాల పౌరులు మంచి సంబరంగా కనిపిస్తున్నారు.

గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనూ సౌదీ అరేబియాలో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. పైగా హిమపాతం. దీంతో సౌదీ అరేబియాకు ఇకపై ఎడారి దేశంగా కాకుండా మైదాన ప్రాంతంగా మారుతుందా అన్న అంచనాలు మొదలయ్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News