కరోనా వైరస్ సంక్షోభం, ప్రతికూల ప్రభావం నుంచి కోలుకునే శక్తి సామర్థ్యాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. అలాగే భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ప్రణాళికలు పట్టాలెక్కించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పెట్రో కెమికల్స్, రిఫైనింగ్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయం తదితర రంగాల్లో వంద బిలియన్ డాలర్ల మేర భారత్‌లో పెట్టనున్నట్లు ప్రకటించారు. ‘భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు పట్టాలెక్కుతున్నాయి. రెండు దేశాల్లోని పలు రంగాల్లో పెట్టుబడుల అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మేం చర్చిస్తున్నాం’ అని సౌదీ రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సాతి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత్ ను సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామిగా, సన్నిహిత మిత్రుడిగా రాయబారి తెలిపారు. రక్షణ, భద్రతపై రెండు దేశాలకూ కీలకమైన అంశాల్ని గుర్తించి సహకారం అందించుకుంటున్నట్లు వెల్లడించారు. మహమ్మారి ప్రభావం దృష్ట్యా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి భారత్ చర్యలను మహ్మద్ అల్ సాతి అభినందించారు. ఈ ప్రాంతంలో ఇతర ఆర్థిక వ్యవస్థలను కూడా ఉన్నతం చేయడానికి, రెండు దేశాల ఆర్థిక పునరుద్ధరణకు దోహదపడుతుందని తెలిపారు. అత్యంత ప్రముఖ రంగాలకు భారత్ అందించిన ఆర్థిక ప్యాకేజీ ప్రశంసనీయమన్నారు.
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే గతవారం సౌదీ పర్యటనపై మాట్లాడకుండానే.. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు చేయడం వల్ల రక్షణ, భద్రత, ఉగ్రవాద నిరోధం సహా పలు రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలు తెరిచాయన్నారు. వాణిజ్య భాగస్వామ్యంపై, రిలయన్స్ రిటైల్ కోసం సుమారు 1.3 బిలియన్ డాలర్లు, రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్ లలో 1.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం ఆయన ప్రస్తావించారు.
సౌదీ అరాంకో భారతదేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ టు కెమికల్ బిజినెస్‌లో వాటాను కొనుగోలు చేయడానికి అరామ్ కో తీసుకున్న నిర్ణయం, వెస్ట్ కోస్ట్ రిఫైనరీ పెట్రోకెమికల్ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి అరామ్‌కో నిబద్ధత భారతదేశ ఇంధన రంగం అభివృద్ధిలో సౌదీ అరేబియాకు ఉన్న ఆసక్తిని సూచిస్తుందని చెప్పారు.
ఇవే కాకుండా భారత్ లో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను అన్వేషణ కొనసాగిస్తుందని సౌదీ రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సాతి తెలిపారు.