శృంగారంతో కరోనా సోకుతుందా?

Update: 2020-04-25 01:30 GMT
నెలరోజులుగా లాక్ డౌన్.. అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో తమ భార్యలు, పార్ట్ నర్స్ తెగ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ నెలరోజుల వ్యవధిలో గర్భిణుల సంఖ్య భారీగా పెరిగిందని.. కండోమ్ ల విక్రయాలు బాగా అయ్యాయని.. పోర్న్ వీక్షణం విపరీతంగా పెరిగిందని వార్తలు వచ్చాయి.

అయితే కరోనా వైరస్ భయం మాత్రం శృంగార ప్రియులను కలవరపెడుతోంది. శృంగారంతో కరోనా వైరస్ సోకుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఆ భయంతోనే చాలా మంది తమ భాగస్వాములను దూరంగా పెడుతున్నారట. దీనిపై అందరిలోనూ ఆందోళనలు కలుగుతున్నాయి.

దీంతో శృంగారం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా లేదా అనే విషయం తేల్చేందుకు తాజాగా అమెరికా, చైనా శాస్త్రవేత్తలు పరీక్షించారు.

తాజాగా పరిశోధనలో 34మంది కరోనా వైరస్ సోకిన రోగుల నుంచి వీర్యం నమూనాలను సేకరించి విశ్లేషించారు. వీర్యంలో కరోనా వైరస్ కనిపించలేదు. దీంతో కరోనా సోకినా సెక్స్ లో పాల్గొంటే ఇతరులకు సోకే ప్రమాదం లేదని తేలింది. వీర్యం, వృషణాల్లో కరోనా వైరస్ ప్రవేశించలేదని తేల్చారు. సో ఇక సుబ్బరంగా ఈ లాక్ డౌన్ లో మీ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయండని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Tags:    

Similar News