హైదరాబాద్ మహానగర ప్రజలకు మాత్రమే కాదు.. భాగ్యనగరానికి వచ్చే చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంటుంది ఐమాక్స్. ఇప్పుడైతే బోలెడన్ని మల్టీఫ్లెక్స్ లు వచ్చాయి కానీ.. ఓ ఐదారేళ్ల క్రితం మొనగాడి మల్టీఫ్లెక్స్ అంటే ఐమాక్సే. ఇప్పటికి హైదరాబాద్ లో ఐమాక్స్ లోని బిగ్ స్క్రీన్ ను తలదన్నే స్క్రీన్ ను ఎవరూ ఏర్పాటు చేయపోలేదు. ఇన్ని ప్రత్యేకతలున్న ప్రసాద్ ఐమాక్స్ మీద కేసు నమోదైంది.
నగరంలోని తార్నాకకు చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఐమాక్స్ థియేటర్ మీద ఫిర్యాదు చేశారు. ఐమాక్స్ లోని భారీ స్క్రీన్ భద్రతా పరంగా ఏ మాత్రం అనుకూలంగా లేదని.. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రేక్షకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అనుకూలంగా లేదని పేర్కొన్నారు.
బిగ్ స్క్రీన్ థియేటర్లో 14 వరుసల్లో ఒక్కో వరుసకు 47 సీట్లు ఉన్నాయని.. ఏదైనా అత్యవసరం ఏర్పడితే ప్రేక్షకుల ప్రాణాలకు ముప్పేనని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేకపోవటంతో నేరుగా హైకోర్టుకే ఈ వివరాల్ని తెలియజేస్తూ కోర్టును సంప్రదించారు.
గోపాల్ రాసిన లేఖను హైకోర్టు పరిశీలించి.. దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది. ఈ ఉదంతంపై వెంటనే చర్యలు చేపట్టాల్సిందని థియేటర్ యాజమాన్యానికి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. హైదరాబాద్ కమిషనర్ కు.. అగ్నిమాపక డీజీలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మూడు వారాల వ్యవధిలో పూర్తి వివరాలు తెలియజేస్తూ వివరాలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి రియాక్ట్ అయి.. థియేటర్ లోని ఇబ్బంది గురించి తన సందేహాన్ని వ్యక్తం చేసే వరకూ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్లు?