సీటిల్ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ మ‌న‌మ్మాయే

Update: 2017-11-20 05:12 GMT
దేశం కాని దేశంలో మ‌నోళ్ల స‌త్తా చాటుతున్నారు. ఆ రంగం..ఈ రంగం అన్న తేడా లేకుండా ప్ర‌తి రంగంలోనూ త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. మిగిలిన రంగాల్లో దూసుకెళ్ల‌టం కాస్త స‌లువే. కానీ.. రాజ‌కీయ రంగంలో అంత వీజీ కాదు. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా లోక‌ల్ ఫీలింగ్ కామ‌న్‌. అందులోకి లోక‌ల్ ఫీలింగ్ భారీగా ఉండే ట్రంప్ లాంటి అధినేత ఏలుబ‌డి వేళ‌.. అమెరిక‌న్లు త‌మ మూలాలు లేని వారిని అక్కున చేర్చుకుంటారా? అంటే డౌటేన‌ని చెప్పాలి.

అయితే.. అందుకు భిన్న‌మైన ఫ‌లితం  ఒక‌టి తాజాగా చోటు చేసుకుంది. ప‌ద‌హారేళ్ల క్రితం కేరాఫ్ చెన్నైగా ఉన్న ఒక మ‌హిళ‌.. తాజాగా ఒక న‌గ‌రానికి డిప్యూటీ మేయ‌ర్ గా ఎన్నిక కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

2001లో ఉన్న‌త విద్య కోసం అమెరికాకు వెళ్ల‌టానికి ముందు వ‌ర‌కు షెపాలి రంగ‌నాథ‌న్ కేరాఫ్ చెన్నైగా ఉండేవారు. ఆమెతండ్రి రంగ‌నాథ్ కాగా.. త‌ల్లిపేరు షెరిల్‌. చెన్నైలోని నుంగంబాక్కంలోని గుడ్ షెప్ప‌ర్డ్ కాన్వెంట్ చ‌దువును పూర్తి చేసుకొని స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఎస్సీ జువాల‌జీ పూర్తి చేశారు. అనంత‌రం ఉన్న‌త చ‌దువుల కోసం యూఎస్ వెళ్లారు. సీన్ ఇక్క‌డితో క‌ట్ చేసి.. వ‌ర్త‌మానంలోకి వ‌స్తే..

షెపాలి తాజాగా సీటిల్ న‌గ‌రానికి డిప్యూటీ మేయ‌ర్ గా ఎన్నిక‌య్యారు. ఓ ఎన్జీవోకు ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమె.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీటిల్ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వికి ఎంపిక‌య్యారు. చెన్నై బోటు క్ల‌బ్ నిర్వ‌హించిన అనేక పోటీల్లో విజ‌యం సాధించిన షెపాలి అన్నావ‌ర్సిటీలో ఎన్విరాన్ మెంట‌ల్ సైన్స్ లో పాస‌య్యారు. దేశం కాని దేశంలో మ‌నమ్మాయ్ రాజ‌కీయంగా రాణించ‌టం గ‌ర్వ‌కార‌ణంగా చెప్పాలి.
Tags:    

Similar News