మిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్‌లో వాచ్ మెన్ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి కారులో వచ్చిన దుండగులు ఎస్టేట్ కు కాపలా ఉన్న ఇద్దరు వాచ్ మెన్లపై దాడికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో ఒక వాచ్ మెన్ మృతి చెందగా మరో వాచ్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయిదు బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఊటీలోని కొడనాడ్ ఎస్టేట్ సుమారు 900 ఎకరాలు ఉంటుంది. దీని విలువ దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఎస్టేట్ లో ఎక్కువగా తేయాకు తోటలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న భారీ బంగ్లాలో జయ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేవారు. ఊటీలోని జయలలిత ఎస్టేట్ వాచ్ మెన్ ను హత్య చేసిన దుండగులు కీలకమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. జయ ఆస్తుల పత్రాలే లక్ష్యంగా ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల్లో ఇది తాజా ఘటన ఇది. కొద్ది రోజుల కిందట చెన్నై శివార్లలోని జయలలితకు చెందిన భవంతికి నిప్పుపెట్టి డాక్యమెుంట్లను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/