ముంబై క్రూయిజ్ లో డ్రగ్స్ కేసుపై దుమారం ముదురుతోంది. ఆర్యన్ ఖాన్ ను కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబైని, మహారాష్ట్రను టార్గెట్ చేసి కేంద్ర సంస్థలు ఈ డ్రగ్స్ గుట్టు మట్లను బయటపెడుతున్నాయి. దీనిపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన సర్కార్ గుర్రుగా ఉంది.
ఈ క్రమంలోనే ముంబైపై ఎన్సీబీ దాడులను తేల్చుకునేందుకు శివసేన సర్కార్ రెడీ అయ్యింది. ఎస్సీబీ అధికారి సమీర్ వాంఖడే బీజేపీ కార్యకర్తలా మారారని విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు శివసేన నేత కిశోర్ తివారీ.. ఈ మెయిల్ ద్వారా పిటీషన్ దాఖలు చేశారు. ఆర్యన్ ఖాన్ ప్రాథమిక హక్కులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు తివారీ.
ముంబైలో డ్రగ్స్ పార్టీ లో పట్టుబడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోసం ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకులు సుప్రీంకోర్టు తలుపు తట్టడం సంచలనమైంది. ఆర్యన్ కు మద్దతుగా శివసేన నాయకులు ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ కూడా ఎన్సీబీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈ కేసును ట్రీట్ చేస్తోందని.. చిన్న డ్రగ్స్ కేసుకు ఇంత హంగామా చేస్తోందని విమర్శించారు.
ముంబై ఎన్సీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని.. ఎన్సీబీపై న్యాయవిచారణ జరపాలని కిశోర్ తివారీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రెండేళ్లుగా సెలబ్రెటీలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని.. ఈ డ్రగ్స్ కేసులో అసలు నిజాలు నిగ్గుతేల్చేందుకు న్యాయ విచారణ చేపట్టాలని కోరారు.
ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ లోని జైల్లో ఉన్నాడు. అతడి బెయిల్ పిటీషన్ పలుమార్లు తిరస్కరణకు గురైంది. 5 రోజుల క్రితం ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఆర్యన్ కాన్ బెయిల్ పిటీషన్ పై బుధవారం తీర్పు వెల్లడించింది.