అనుకుంటాం కానీ అప్పు లేనోడు ఈ ప్రపంచంలో ఎవడు ఉంటాడు చెప్పండి? అంబానీ దగ్గరి నుంచి వీధిలో అడుక్కునేటోడి వరకు అప్పు.. ఎవరి స్థాయిలో వారికి ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా వ్యక్తులకు మాత్రమే కాదు.. తోపు దేశాలు సైతం అప్పుల లెక్కల్లో చిక్కి ఉంటాయన్నది మర్చిపోకూడదు. ప్రపంచానికి పెద్దన్న అమెరికా కానీ.. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన.. దిక్కుమాలిన పాలసీలతో ప్రభుత్వాన్ని నడిపే చైనాకు అప్పుల తిప్పలు తప్పవన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అప్పు అప్పుడప్పడు హాట్ టాపిక్ గా మారుతుూ ఉంటుంది. కానీ.. అప్పు లేనోళ్లు ఎవరూ ఉండరు. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాల అప్పుల లెక్కలు విస్మయానికి గురయ్యేలా మారాయని చెబుతున్నారు. తాజాగా అప్పుపై ఐఎంఎఫ్.. అదేనండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆసక్తికర వ్యాఖ్య చేసింది.
ప్రపంచ దేశాల అప్పు సుమారు 226 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా వివిధ దేశాలు పెద్ద ఎత్తున అప్పులు చేయక తప్పలేదని చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో పలు దేశాలు పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయని చెబుతున్నారు. 2020 కంటే 2021లో భారత్ తీసుకున్న అప్పులు 90.6 శాతం ఎక్కువని సదరు సంస్థ చెబుతోంది. మరి అప్పులు చేస్తున్న దేశాలు సరే.. వారికి అప్పు ఇస్తున్న దేశాల సంగతికి వస్తే.. అప్పులు ఇచ్చిన వారిలో డెవలప్ దేశాలతో పాటు.. చైనానే 90 శాతం రుణాల్ని ఇచ్చినట్లు చెబుతున్నారు.
కొవిడ్ తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బ తిన్నాయని.. దీంతో పలు డెవలపింగ్ దేశాలతో పాటు చిన్న చిన్న దేశాలు పెద్ద ఎత్తున అప్పుల కోసం ఎగబడే పరిస్థితి. కోవిడ్ కారణంగా 2021లో సుమారు 65 నుంచి 75 మిలియన్ల వరకు దారిద్ర్యంలోకి వెళ్లే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు అర్థమైందా? అందరూ అప్పుల అప్పారావులేనని.