ఉత్తర ప్రదేశ్‌లో మహిళ పట్ల ఓ ఎస్సై అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఆమె ఎదుటే హస్త ప్రయోగం చేశాడు. డియోరియోలోని భట్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన కూతురుతో కలిసి భూవివాదంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఈ ఫిర్యాదు గురించి మాట్లాడుదామంటూ ఎస్సై భీష్మపాల్ సింగ్ సదరు మహిళను తన గదిలోకి తీసుకు వెళ్లాడు. గదిలో వారి ముందే అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు.
ఎస్సై ప్రవర్తన పట్ల నిర్ఘాంతపోయిన తల్లీకూతుళ్లు ఆయన తీరును రహస్యంగా వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. ఎస్సై ప్రవర్తన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలని, మళ్లీ ఖాకీ డ్రెస్ వేసుకోకుండా చేయాలని డిమాండ్ చేశారు.
తాను తన భూమికి చెందిన సమస్య పరిష్కారం కోసం వెళ్లానని, అప్పటికే పలుమార్లు స్టేషన్ మెట్లు ఎక్కానని, గతంలోను సదరు ఎస్సై ఇలాగే ప్రవర్తించాడని బాధిత మహిళ చెప్పారు. ఎస్సై గురించి తనకు తెలిసిన ఓ స్నేహితురాలికి చెబితే ఆమె పట్ల కూడా ఇలాగే ప్రవర్తించాడని తెలిసిందని, దీంతో అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని సీక్రెట్ కెమెరాను తీసుకు వెళ్లానని చెప్పారు. అతని గురించి అందరికీ తెలియాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు.