గాడ్ పాలిటిక్స్: బీజేపీ దారిలో కాంగ్రెస్ హిందుత్వం

Update: 2020-01-28 08:03 GMT
దేశంలో ‘గాడ్ పాలిటిక్స్’ ఎక్కువైపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే వాటి చుట్టూ తిరుగుతోంది. ‘అయోధ్య రామమందిరం’ పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయం అంతా ఇంతాకాదు.. ఇప్పుడు సెక్యులర్ అంటూ ఇన్నాళ్లు రాజకీయం చేసిన కాంగ్రెస్ కూడా తన స్టాండ్ మార్చుకుంది. బీజేపీని ఫాలో అవుతోంది.

రామ జన్మభూమి తో బీజేపీ ప్రభుత్వాలు హల్ చల్ చేస్తుంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ గోదలోకి దిగాయి. రామాయణంలో సీతాదేవి ఎక్కడైతే తన పతివ్రత ను నిరూపించుకోవడానికి లంకలో అగ్ని ప్రవేశం చేసిందో అక్కడే సీతాదేవికి ఓ భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నట్టు తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ప్రకటించడం సంచలనమైంది.

అయితే బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో కొలువైనప్పుడే నాటి బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడి కమల్ నాథ్ ప్రభుత్వం కొలువుదీరింది. దీని పై తాజాగా సీఎం కమల్ నాథ్ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.

శ్రీలంక దేశంలోని సెంట్రల్ ప్రావిన్స్ లోని ‘దివురంపోలా’ అనే ప్రాంతమే రామాయణంలో సీతాదేవి అగ్రిప్రవేశానికి వేదికైందని స్థానికులు విశ్వసిస్తారు. దీనికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. అందుకే ఇక్కడ భారీ సీతాదేవి ఆలయాన్ని శ్రీలంక ప్రభుత్వం సహకారంతో నిర్మించనున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తెలిపారు.

ఇలా బీజేపీనే కాదు.. సెక్యులర్ తో వెనుకబడిన కాంగ్రెస్ కూడా ఆ పిడివాదాన్ని వదలి హిందుత్వ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని సీతాదేవి ఆలయం పేరిట కొత్త రాజకీయం మొదలు పెట్టింది. మరి ఇది అంతిమంగా కాంగ్రెస్ కు ఎలాంటి లాభం చేకూర్చుతుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News