చేతులెత్తి మొక్కుతున్నా.. ఇండియాకు రప్పించండి.. లేదా కనీసం ఇక్కడే వైద్య చికిత్స అందేలా చూడండి.. క్షణక్షణం ఆరోగ్యం క్షీణిస్తోంది. నడవలేని స్థితిలోకి వచ్చాను. ఎంతకాలం ప్రాణాలతో ఉంటానో తెలియడం లేదు అని వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సందీప్‌నాథ్ దాసి భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆయన హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కంపెనీ పనిలో భాగంగా గత సెప్టెంబర్ నెలలో లండన్ వెళ్ళారు.
లండన్ వెళ్లిన తరువాత మార్చి 14న అస్వస్థత చెందారు. అయితే , అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూనే విధులకు హాజరయ్యారు. మార్చి 16న ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించింది. రుమటాయిడ్ ఆర్థ్రయిటీస్ జబ్బు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు వచ్చే ప్రయత్నం చేసాడు. కానీ , అప్పటికే లండన్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. మార్చి 18 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించారు. దీంతో సందీప్ నాథ్ లండన్ లో చిక్కుకుపోయారు.
లండన్‌లో కరోనా విజృంభించడంతో అంతటా లాక్ డౌన్ కొనసాగుతోంది. బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. వెళ్ళగలిగినా డాక్టర్లెవరూ అందుబాటులో లేరు. నా సమస్య భారత ప్రభుత్వ రాయబార కార్యాలయానికి వివరించాను. ఫలితం లేదు అని , కానరాలేదు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య నాయకులకు, వరంగల్ లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ట్విట్టర్ ద్వారా నా ఆవేదన పంపించాను, కానీ తగిన విదంగా రెస్పాన్స్ రాలేదు అని, ఇప్పుడు నా భాద ఎవరికి చెప్పుకోవాలో బోధపడడం లేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో సుబేదారి బ్యాంక్ కాలనీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఏకాకిలా ఇక్కడే మిగిలిపోయాను అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఇలానే ఉంటే ఎక్కువ రోజులు బ్రతకలేను అని , ఇప్పటికిప్పుడు ఇండియాకు తీసుకువచ్చే పరిస్థితి లేకపోయినా కనీసం లండన్‌లోనే వైద్యం అందించే విధంగా చూడాలని భారత ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు.