అమెరికాలో కూడా ఉత్త‌రాది ఇండియ‌న్ల‌దే హ‌వా

Update: 2019-11-01 04:56 GMT
భార‌తీయుల్లో ఈశాన్య‌,ద‌క్షిణ భార‌తీయుల కంటే...ఉత్త‌రాది వారే ఎక్కువ‌గా అవకాశాలు సొంతం చేసుకోవ‌డం, ఇటు రాజ‌కీయ ప‌రంగా అటు అధికారం విష‌యంలోనూ ఆదిప‌త్యం చెలాయించ‌డం చేస్తుంటార‌ని ఓ అభిప్రాయం ఉన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్న‌ప్ప‌టికీ...మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సైతం వారు సొంతం చేసుకున్నారు. అది కూడా అగ్ర‌రాజ్యం అమెరికాలో. న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులు ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ మొదటిస్థానంలో ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాతీ, తెలుగు భాషలున్నాయి.

ఈ ఆస‌క్తిక‌ర వివ‌రాలు `అమెరికా సెన్సస్‌ బ్యూరో`లో స్ప‌ష్ట‌మ‌య్యాయి. సంస్థ విడుద‌ల చేసిన‌ అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే వివరాలు ప్రకారం.. 2018 జులై 1నాటికి అమెరికాలోని భారతీయుల్లో హిందీ మాట్లాడే వాళ్లు 8.74 లక్షల మంది ఉన్నారు. 2017 గణాంకాలతో పోలిస్తే ఇది 1.3 శాతం పెరుగుదలను నమోదుచేసింది. 2010లో పోల్చితే హిందీ 43.5 శాతం పెరుగుదలను నమోదుచేసింది. తెలుగు మాట్లాడే వారి పెరుగుదల మాత్రం గరిష్టంగా 79.5 శాతం పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుతం తెలుగు మాట్లాడే వారు 4 లక్షల మంది ఉన్నారు. బెంగాలీ మాట్లాడే జనాభా ఎనిమిదేళ్ల‌ కాలంలో 68 శాతం పెరుగుదలతో 3.75 లక్షల మంది ఉన్నారు. తమిళం మాట్లాడే వారు 67.5శాతం పెరుగుదలతో 3.08 లక్షల మంది ఉన్నారు.

ఇదిలాఉండ‌గా,ఇండియ‌న్లకు చెందిన‌ మ‌రో ఆస‌క్తిక‌ర వార్త సైతం వెలుగులోకి వ‌చ్చింది. అమెరికాలో ఆశ్ర‌యం కోరే భార‌తీయుల సంఖ్య పెరిగిపోతోంది. 2014 నుంచి అమెరికాలో దాదాపు 22 వేల మంది భారతీయులు ఆశ్రయం కోరినట్టు యూఎస్‌ అధికారులు వెల్లడించారు. వీరిలో 6935 మంది మహిళలు, 15,436 మంది పురుషులు ఉన్నారని తెలిపారు. నిరుద్యోగం, అసహనం భారత్‌లో ఎదురుకావడమే కారణంగా నార్త్‌ అమెరికన్‌ పంజాబ్‌ అసోసియేషన్‌ (ఎన్ఏపీఏ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్నం సింగ్‌ చాహల్‌ వెల్లడించారు. ఈ సంఖ్యను తీవ్రంగా పరిగణించవలసి ఉందన్నారు.
Tags:    

Similar News