గత కొద్దికాలంగా తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని, ఆ పార్టీ విధానాలను తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శిస్తుండగా... తెలంగాణలో గులాబీ పార్టీ పాలనపై బీజేపీ విరుచుకుపడుతోంది.
త్వరలోనే కేసీఆర్ అవినీతిని బయటపెడుతామని సైతం ఆ పార్టీ ముఖ్య నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఇలా విమర్శలు-ప్రతి విమర్శలు కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ సారథ్యంలోని మీడియా సంస్థలకు సభా హక్కుల కమిటీ పరిశీలన, నోటీసులు జారీ అవడం సంచలనంగా మారింది.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ తన అక్కసు వెళ్లగక్కారని ఆరోపించింది. నిరసనలు తెలిపింది.
దీనిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ప్రధాని వ్యాఖ్యలను, సభా వ్యవహారాలను నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు వక్రీకరించాయని, తప్పుగా ప్రచురించాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్పీకర్.. సభా హక్కుల కమిటీకి పంపించారు.
దీనిని పరిశీలించిన లోక్‌సభ సభా హక్కులు, నైతిక విలువల విభాగం ఈ రెండు పత్రికలకు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆ రెండు పత్రికల సంపాదకులను ఆదేశించింది.
ఈ నోటీసులపై తెలంగాణ శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు ప్రచురించిన వార్తల్లో తప్పులేదని ఆయన అన్నారు. ఉన్నదున్నట్లు రాసిన పత్రికలపై బీజేపీ ఎంపీలు తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.