నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. ఆయన కుటుంబ సభ్యులు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. నివేదిక తెప్పించుకుంటానని వారితో చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో.. ఎంపీ కేసులో ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని లోక్ సభ సభాహక్కుల కమిటీతోపాటు హోంశాఖను నివేదిక కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం లేఖ రాసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఏంపీని అరెస్టు చేయడానికి ఒకే ఒక సమయంలో మాత్రమే స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సమయంలో అరెస్టు చేయాల్సి వస్తేనే.. స్పీకర్ అనుమతి తప్పనిసరని అంటున్నారు. మిగిలిన సందర్భాల్లో స్పీకర్ కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందున ముందస్తుగా స్పీకర్ కు తెలియజేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అరెస్టు చేసిన తర్వాత సమాచారం ఇస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఈ లెక్కన ఏం జరిగిందో తెలుసుకోవడానికే స్పీకర్ నివేదిక కోరొచ్చని అంటున్నారు.