టీడీపీ నేతలకి సరైన సవాల్ విసిరిన శ్రీకాంత్ రెడ్డి!

Update: 2020-04-16 11:20 GMT
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి .. మరోసారి తన విశ్వరూపం చూపించారు. తనదైన శైలిలో మాట్లాడుతూనే... ప్రతిపక్ష పార్టీ పై విమర్శలు కురిపించారు. రాష్ట్రం ఇప్పుడు ఒక విపత్కర పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో రాష్ట్రంలో కరోనాను అరికట్టడానికి సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అని, ప్రతి క్షణం కూడా ప్రజల మంచి కోసం పని చేస్తున్న పార్టీ పై , సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయడం మంచింది కాదు అని అయన తెలిపాడు. రాష్ట్రంలో కరోనా అలజడి సృష్టిస్తున్న సమయంలో కూడా తెలుగు దేశంపార్టీ నాయకులు కుల రాజకీయాలు చేయడంపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

గురువారం ఆయన రాయచోటి లో మీడియా సమావేశంలో టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు ప్రణాళికా బద్దంగా చర్యలు చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం అడుగులు వేస్తుంది అని చెప్పారు. అలాగే క్వారంటైన్ నుంచి డిశ్చార్జి అయిన ప్రతి వ్యక్తికి రూ.2 వేలు ఇవ్వాలని సీఎం జగన్ చెప్పడం అభినందనీయం. కానీ, ఇవేవీ గిట్టని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పాలనపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు.

ముఖ్యంగా అయన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియా పై రాద్దాంతం చేస్తున్న టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు అని టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలును చేయడం దారుణమన్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దని విమర్శించే ప్రతి నాయకుడు తమ బిడ్డలను తెలుగుమీడియంలోనే చదివిస్తారా అని సవాల్ విసిరారు. అసలు ఇంగ్లీష్ మీడియం వద్దు అనే వారి పిల్లలు , మనవళ్లు ఇప్పుడు ఏ మీడియం లో చదుతున్నారో ఒక్కసారి గుర్తు చేసుకొని మాట్లాడాలని , మీ పిల్లలకి ఒక న్యాయం ...పేద పిల్లలకి మరో న్యాయమా అని అన్నారు. మీ పిల్లలు మాత్రం విదేశాలకు వెళ్లి చదువులు చదవాలి, బడుగు బలహీన వర్గాల పిల్లలుకు ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోకూడదు అని చెప్పడం ఇదేమి న్యాయమంటూ శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. అసలు రాష్ట్రంలోని ఎస్ సి , ఎస్ టి , బి సి, మైనారిటీలంటే బాబు కు ఇష్టం లేదని,

అలాగే , అయన మాట్లాడుతూ ..చంద్రబాబు జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ అభివృద్ధి చెందినదీ కాబట్టి జపాన్ భాషను నేర్చుకోవాలని చెప్తాడు. కానీ, ఇక్కడ మాత్రం చంద్రబాబు పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం వద్దు అని నానారచ్ఛ చేస్తున్నాడు అని , చంద్రబాబు దొంగప్రేమ ఇక్కడే బయటపడుతుంది అని అన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇది ఫ్యాక్షనిస్టు రాజ్యమంటూ లేఖ రాయడం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు. అలాగే మరో మాజీ ఎంపీ కులం జోలికి వస్తే లేపేస్తామంటూ వ్యాఖ్యానాలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోందన్నారు. ప్రస్తుత కరోనా విపత్తు సమయం లో సామాజిక దూరం పాటించాలే కానీ , సామాజిక కులాలను విడదీసే భయంకరమైన వ్యాధికి తెరతీవడం మంచిది కాదు అని అన్నారు. గతంలో ఇదే విధంగా మీకు ఎదురొడ్డి నిలబడిన రాజశేఖర్ రెడ్డి గారిని లేపేసారని, ఇప్పుడు అలాగే జగన్ ను లేపేయాలని ఆలోచిస్తున్నారని , అది జరగదు అని, సీఎం జగన్ లేపే ధైర్యం ఉంటే రోడ్డు పైకి రావాలని ఆయన సవాల్ విసిరారు.

అలాగే, రాజధాని వికేంద్రీకరణ విషయంలో వ్యతిరేకించడంతో పాటు కీయా కంపెనీ పై లేని పోని వదంతులను సృష్టించింది మీరే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం పెట్టినంత మాత్రాన తెలుగు పై ప్రేమ లేనట్టు కాదు అని, రాష్ట్రంలో తెలుగు మహా సభలును నిర్వహించిందే మహానేత వైఎస్ ఆర్ , మీ పార్టీ నేతలు తెలుగు పై ఎంత ప్రేమ చుపించారో అందరికి తెలుసు అని అన్నారు. అలాగే కుల మతాలతో మాకు పనిలేదని రాష్టంలో 50 శాతం రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలుకు కల్పించింది సీఎం జగన్ అని, మాది కత్తులు పట్టుకుని దోమలు ఎలుకల పై యుద్ధం అంటూ పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం కాదన్నారు. దోమకు రూ.5 వేలు, ఎలుకకు రూ 10 వేలు చొప్పున కాజేసే ప్రభుత్వం మాది కాదంటూ విమర్శలు కురిపించారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుండి విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించే నిధులను ఇకపై వారి తల్లుల ఖాతాలలో జమ చెయ్యాలని సీఎం తీసుకున్ననిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి పెరిట రూ 3 లక్షల కోట్లు అప్పు చేయడం, 60 వేల కోట్ల రూపాయలు బిల్లులను పెండింగ్ లో పెట్టడమే కాకుండా ఫీజు రీయంర్స్ మెంట్ డబ్బులు చెల్లించక విద్యార్థుల జీవితాలతో చెలగాటం అడ్డుకున్నారని. నాటి విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపుల సంబంధించి రూ.2వేల కోట్లను సీఎం జగన్ చెల్లించారని , అది తమకి , తమ పార్టీ కి విద్యార్ధులపై , యువత పై ఉండే ప్రేమ అని తెలిపారు. అలాగే కరోనా పంజా విసురుతున్న సమయంలో రేషన్ కార్డ్ లేనివారికి కూడా బియ్యాన్ని ఉచితంగా అందచేయడమే కాక 5 రోజులలోనే రేషన్ కార్డు అందిస్తున్నామని, కార్డు అప్లై చేపించిన వెంటనే వారికీ రేషన్ సరుకులు కూడా ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని ఎదుర్కొని రెండు అడుగులు ముందుకు వేయడం సీఎం జగన్ నైజం అని, ఆ నాడు రాజశేఖర్ రెడ్డి గారు అదే చేసారు అని, నేడు జగన్ గారు అంతకన్నా బాగా చేస్తున్నారు అని , ఇంకా ఎన్నో మంచి పనులు చేసి తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకుంటారు అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News