ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రెండు రోజులుగా కేసులు 2500 కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సామాన్యులు.. వీఐపీలు అందరికీ సోకుతోంది. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతోంది.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. మంత్రులను కూడా కరోనా టచ్ చేసింది. అధికారులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడ్డారు.
తాజాగా మరో అధికారపార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. వైసీపీ శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో కూడా ఈ మేరకు ధ్రువీకరించినట్టు ఒక పోస్టు వైరల్ అవుతోంది.

తాజా కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 40వేలు దాటింది. ఇప్పటివరకు ఏపీలో కరోనాతో 534మంది ప్రాణాలు కోల్పోయారు.