ఏపీ సర్కారుపై టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫైరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త పెట్టుబడులు తీసుకురాలేక రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రకటనలకే ఆదాయం చాలట్లేదా?
జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ కూడా అయిన పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇంకెంతకాలం పిట్టకథలతో నెట్టుకొస్తారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి పొంతన లేని ప్రకటనలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంతో స్పష్టం చేయాలని పయ్యావుల డిమాండ్ చేశారు. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువని ఆరోపించారు. కొత్త పెట్టుబడులు రాక రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జీతాలు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు?
ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల మాదిరి ఎందుకు జీతాలు ఇవ్వటం లేదని పయ్యావుల నిలదీశారు. మరో తరం పాటు రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని మండిపడ్డారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా ? అని ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని పయ్యావుల ఎద్దేవా చేశారు.మూల ధన వ్యయం ఎంతో చెప్పే దమ్ముందా?
"ఇంకెంతకాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు. చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక పరిస్థితిపై బుగ్గన పొంతన లేని ప్రకటన విడుదల చేస్తున్నారు. మూలధన వ్యయం ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంతో స్పష్టం చేయాలి. పథకాలకు ఖర్చు చేసే మొత్తం కంటే ప్రకటనలకు వెచ్చించిందే ఎక్కువ. కొత్త పెట్టుబడులు రాక రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కంటే రెండు రెట్లు ఎక్కువ అప్పులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు`` అని పయ్యావుల నిప్పులు చెరిగారు.