కర్నూల్ జిల్లాలో సరిగ్గా అయిదేళ్ల క్రితం జరిగిన ఓ టెన్త్ బాలిక సుగాలి ప్రీతీ బాయ్ గుర్తుందా. ఈ అమ్మాయి అనుమానస్పదంగా మృతి చెందింది. నాటి నుంచి నేటి వరకూ ఈ కేసు మిస్టరీ అయితే వీడలేదు. ఇక ఈ కేసు విషయంలో గత టీడీపీ ప్రభుత్వం మీద వైసీపీ ఆరోపణలు చేస్తే వైసీపీ అధికారంలోకి వస్తే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏకంగా కర్నూల్ వెళ్ళి ర్యాలీ నిర్వహించి మరీ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
ఈ నేపధ్యంలో జగన్ సర్కార్ ఈ కేసును సీబీఐ కి అప్పగించింది. సీబీఐ విచారణ ఇంకా మొదలుకాలేదు కానీ ఒక్కసారిగా స్థానిక పోలీసుకు దూకుడు పెంచారు. ఉన్నట్లుండి బళ్లారీలో చౌరస్తాలో ఒక ఆటో మొబైల్ షాప్‌లో ఉద్యోగం చేసే నాగిరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం అయితే పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది.
అసలు ఎందుకు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. దీని వెనక మ్యాటర్ ఏంటి అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. విషయానికి వస్తే నాగిరెడ్డి అనే వ్యక్తి భార్యా ప్రీతి తల్లి పార్వతీబాయి ఇద్దరూ అక్కా చెల్లెళ్ళుట.
దాంతో ప్రీతి తండ్రివి నీవే అని ఒప్పుకోమని పోలీసులు నాగిరెడ్డిని చితకబాదుతున్నారుట. దీని మీద బాధితుడు అయితే తనకేంటి ఈ టార్చర్ అని వాపోతున్నాడు. మరి పోలీసులకు ఇంతకాలం తట్టని ఈ కొత్త విషయం ఇపుడే తట్టడమేంటి, అలాగే ప్రీతి తండ్రి నాగిరెడ్డి కావడమేంటి అంటే ఇవన్నీ కొత్త ట్విస్టులే అంటున్నారు.
నిజానికి ప్రీతి అనుమానస్పద మృతికి కారకులుగా భావిస్తూ కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్ కరస్పాండెంట్ ఆయన కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మీద సుదీర్ఘమైన దర్యాప్తు సాగింది. ఇక ప్రస్తుతం ఆ ఇద్దరూ బెయిల్‌పై ఉన్నారు.
మరి అన్ని చూపులూ అటుగా ఇంతకాలం సాగిన వేళ సడెన్ గా నాగిరెడ్డి సీన్ లోకి ఎందుకు వచ్చారు అన్నదే చర్చగా ఉంది. మరి ఈ కేసు రాజకీయ రంగు కూడా పులుకున్న సంగతి విధితమే. లోకల్ పోలీసులు నాగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
మరి రేపటి రోజున సీబీఐ అధికారులు ఎవరిని అనుమానిస్తారో ఏ రకమైన కూపీ లాగుతారో చూడాలి. ఇక ఈ కేసు విషయంలో జగన్ సర్కార్ అయితే ఆర్ధికంగా ఇతరత్రా ఆ కుటుంబానికి న్యాయం చేసింది. కానీ ప్రీతి చనిపోవడానికి గల కారణాలు అయితే వెలుగు చూడాల్సి ఉంది. సీబీఐ దర్యాప్తులోనే అవి బయటకు వస్తాయని అంటున్నారు.