మురుగన్ తో సుందర్ సి భేటీ ..బీజేపీలోకి కుష్బూ , గ్రూపు రాజకీయాల వల్లే ఆలస్యం !
ప్రఖ్యాత సినిమా నటి, రాజకీయ నాయకురాలు కుష్భూ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారా అంటే ? ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇది నిజమేమో అనిపిస్తుంది. అయితే , కుష్బూ బీజేపీలో చేరతారని వార్తలు రావడం ఇదే మొదటిసారి ఏమి కాదు ..గతంలో చాలాసార్లు కుష్బూ వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చిన ప్రతీసారి కుష్బూ వాటిని ఖండించేవారు. అయితే బీజేపీలోని గ్రూపు రాజకీయాలు కుష్బూను ఓ పట్టాన నిర్ణయం తీసుకోనివ్వడం లేదంటూ ప్రస్తుతం ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. కుష్బూ బీజేపీలోకి వస్తే పార్టీ బలం పెరుగుతుందన్నది నిజమే, కానీ ఆమె బీజేపీలో ఉండే గ్రూప్ రాజకీయాలకి తట్టుకొని నిలబడగలదా అన్నదే సందేహం. అయితే , ఈ మద్యే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్.మురుగన్ను కుష్బూ భర్త, నట దర్శకుడు సి.సుందర్ కలిశారు. అప్పటినుండి కుష్బూ బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది.
అయితే, సన్నిహితులు మాత్రం ఓ మిత్రుడి ఇంట్లో సుందర్ ఉన్న సమయంలో అక్కడి మురుగన్ వచ్చారే తప్ప ఉద్దేశపూర్వకంగా కలిసింది కాదని చెప్తున్నారు. ఈ భేటికి అంత ప్రాధాన్యతను ఇవ్వనవసరం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో జెండా ఎగురవేయాలని కలలు కంటున్న బీజేపీ పార్టీ నిర్మాణం లో మాత్రం అంతగా ముందడుగులు వేయలేకపోతుంది. జాతీయ కార్యవర్గంలో తమిళనాడు నేతలకు చోటివ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. చివరికి రాజాను కూడా పక్కన పెట్టడంతో బీజేపీ క్యాడర్ కి నిద్రపట్టడం లేదు. ఇక , బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి పోన్ రాధాకృష్ణన్ కు మంత్రివర్గంలో చోటు ఉండేది. అయితే ఈసారి ఆయన కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి ఓడిపోయారు.. మంత్రివర్గంలో చోటివ్వకపోయినా కనీసం పార్టీలోనైనా పెద్ద పీట వేస్తారనుకుంటే అదీ జరగలేదు.
సీనియర్ నేతలు పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, ఇలగణేషన్, హెచ్ రాజా వంటి బోలెడంతమంది నేతలున్నా.. ఏ ఒక్కరికీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు. ఆరేళ్లుగా జాతీయ కార్యదర్శి పదవిలో ఉన్న హెచ్ రాజాను కూడా పక్కన పెట్టడం ఆశ్చర్యకరం. అయితే , రాష్ట్రంలో ఒక్క లోక్ సభ, అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడి నేతలు ఉండబట్టే, ఈసారి వారికి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని నడ్డా తీసుకున్నట్టు సమాచారం. దీంతో 2021 ఎన్నికల్లో అసెంబ్లీల్లో అడుగుపెట్టడం లక్ష్యంగా నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగానే వచ్చే నెల నుంచి వెట్రివెల్ అంటే విజయం సాధిద్దాం అన్న నినాదంతో రాష్ట్ర పర్యటన చేయనున్నారు.