ఏపీ ప్రభుత్వానికి శుభవార్త..ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు భూముల కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును వారంలోగా తేల్చండి అని హైకోర్టుకు సూచించింది. తుళ్లూరు మాజీ తహశీల్దార్ అన్నే సుధీర్ బాబు కేసులో హైకోర్టుకు సుప్రీం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
కాగా, తుళ్లూరులో పేదలను మభ్యపెట్టి భూ కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంపై ఏపీ సిఐడి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. అయితే, సిఐడి దర్యాప్తు పై స్టే ఇవ్వాలని సుధీర్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సిఐడి దర్యాప్తును ఆపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా .. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ అంశంలో కేసు ఏమిటని హైకోర్టు అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తుందని సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నాం. చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది.
ఇలాఉండగా, ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి అసైన్డ్ భూములను మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి లాక్కున్నారని సిఐడి అభియోగాలు మోపింది. తమకు భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్ లో భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని సైతం వీళ్లు బెదిరింపులు చేశారని, ల్యాండ్ పూలింగ్ పథకం అమలు కంటే ముందే పేదల భూముల బదలాయింపు జరిగిందని వెల్లడించింది. వీరి బెదిరింపులకు భయపడి పేదరైతులు భూములు అమ్ముకోగా ఆ భూములను టీడీపీ నేతలు తమ సొంతం చేసుకున్నట్టు చెప్తున్నారు.