అమెరికా అధ్యక్ష బరిలో భాగంగా హిల్లరీ క్లింటన్ - డొనాల్డ్ ట్రంప్ మధ్య సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో రెండో డిబేట్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ డిబేట్ లో వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండటంతో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ డిబేట్ లో కూడా మహిళలపట్ల డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి - విడుదలైన వీడియో టేపులే హిల్లరీ ప్రధాన అస్త్రాలని అంతా భావించారు. ఇదే క్రమంలో హిల్లరీ కూడా రెండొ డిబేట్ మొదలుపెట్టారు. అయితే ఆ డిబేట్ కి కొద్దిసేపటికి ముందే ట్రంప్ కూడా మహిళలకు సంబందించిన అంశాలనే ఆయుధాలుగా హిల్లరీపై వదిలారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్ కు ముందు నలుగురు మహిళలతో కలిసి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో "అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మాపై లైంగిక దాడి జరిపాడు" అంటూ ఆ నలుగురు మహిళలు ముందుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నసమయంలో బిల్ క్లింటన్ తమపై అత్యాచారం జరిపాడని వారిలో ముగ్గురు మహిళలు ఆరోపించగా... బాలికగా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిపాడని మరో మహిళ ఆరోపించింది. ప్రస్తుతం డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్ భర్తే బిల్ క్లింటన్ కావడంతో ట్రంప్ ఈ పైఎత్తు వేశారన్నమాట!!
దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఏ విషయంపై ట్రంప్ టార్గెట్ గా దుమారం రేగుతుందో అదే విషయంపై ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఆమె భర్తపై ఆరోపణలు చేసిన మహిళలతో డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ నలుగురు గురించి మాట్లాడిన ట్రంప్... ఈ నలుగురు మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడటాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశం అనంతరం రెండో డిబేట్ లో ట్రంప్ - హిల్లరీ మధ్య వాడీవేడి మాట్ల యుద్దం నడిచింది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/