కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పని పరిస్థితుల్లో గుణాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ దాదాపుగా కొలాప్స్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలో యువత తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యారు. కొవిడ్ వల్ల బోలెడు మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారు. వలస కార్మికుల పరిస్థితి అయితే దుర్భరంగా మారింది. ఈ క్రమంలోనే వారిని ఆదుకునేందుకు సినీ నటుడు సోనుసూద్ తన శక్తి మేరకు కృషి చేశారు. ఈ సంగతులు పక్కనబెడితే.. కరోనా వల్ల యువతీ యువకులు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నట్లు తేలింది.
ఇకపోతే యూత్ కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల ప్రభావమో లేదా వేరే ఇంకేదైనా కారణాలున్నాయో తెలియదు. కానీ, యువతీ యువకులు పెళ్లిళ్ల కోసం ఆరాటపడుతున్నారట. ఇక మ్యారేజెస్ కోసం యూత్ అప్పులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదట. ఇండియాలెండ్స్ అనే సంస్ధ జరిపిన తాజా సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ సర్వేలో వీటితో పాటు ఇంకొన్ని విషయాలను తెలిపింది. కొవిడ్ వల్ల చాలా మంది యువతీ యువకులు మానసిక సంఘర్షణలకు గురైనట్లు నిర్ధారణ అయింది. లాక్‌డౌన్ ఆ తర్వాత కాలంలో యూత్ మొత్తంగా డబ్బుల్లేక తల్లడిల్లడటంతో పాటుగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలిసింది.
ఇకపోతే కల్యాణ ఘడియలు అయిపోతున్నాయని, పెళ్లిళ్లకు కొవిడ్ అడ్డంకిగా మారిందని చెప్పారట. ఈ తీవ్రమైన ఒత్తిళ్లకు చెక్ ఇటీవల కాలంలో పడినట్లు అంచనా వేస్తున్నారు. కొందరు దేశవ్యాప్తంగా ఉన్న 20 సిటీస్‌లో ఇండియాలెండ్స్ సంస్థ కరోనా పాండిక్ నేపథ్యంలో యూత్ ఆలోచనలపై సర్వే చేపట్టింది. సర్వే వివరాలు సమగ్రంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న యూత్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాలపై నిర్దిష్టమైన ప్రశ్నలతో సర్వే జరిగింది. 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న సుమారు 11 వేల మంది యువతీయువకుల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఎడ్యుకేషన్, బిజినెస్, మ్యారేజ్,హయ్యర్ స్టడీస్, హాబీస్, ఇతర విషయాలపై వారితో మాట్లాడారు.
2020 ఆగస్టు నుంచి 2021 మార్చి వరకు , 2021 ఏప్రిల్ నుంచి 2021 జూలై మధ్యకాలంలో రెండు విడతలుగా ఈ సర్వే జరిగింది. అయితే, సర్వే వివరాల ప్రకారంగా 33 శాతం మంది యువత పెళ్లి కోసం తొందరపడుతున్నట్లు తేలింది. మ్యారేజ్ కోసం అప్పు కూడా చేసేందుకు వారు వెనుకాడొద్దనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైంది. ఉద్యోగం రాకపోవడం కూడా మ్యారేజ్‌కు ఒక సమస్యగా ఉంది. అయితే, యువతీ యువకులు మంచి ఉద్యోగం ఉన్న వారినే పెళ్లి చేసుకోవాల ఆరాటపడుతున్నారనే విషయం కూడా సర్వే ద్వారా క్రిస్టల్ క్లియర్ అయింది. ఇకపోతే పెళ్లి సంగతి ఇప్పుడే ఎందుకు? అనుకునే వారు 22 శాతం మంది ఉన్నట్లు సర్వే తెలిపింది. కరోనా నేపథ్యంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో ఏదో ఒక చిన్న పని చేసుకుకోవాలనే ఆలోచన యూత్‌లో వచ్చినట్లు స్పష్టమైంది. కొవిడ్ వల్ల బిజినెస్‌లోకి వెళ్లేందుకు యువత ఆసక్తి కనబర్చారు. ఉద్యోగాలు ఎప్పుడైనా ఊడిపోవచ్చు. కానీ, వ్యాపారం అయితే కొద్ది కాలాల పాటు నిలబడుతుందని యువత అంచనా వేసుకుంటున్నారు. వేతనాల్లో కోతల వల్ల చాలా మంది యువతీ యువకులు భవిష్యత్తు ప్రణాళికలను పోస్ట్ పోన్ చేసుకున్నట్లు సర్వే పేర్కొంది.